ఆసీస్ అదరహో... | Australia wrap up crushing first Test victory over West Indies in Hobart | Sakshi
Sakshi News home page

ఆసీస్ అదరహో...

Published Sun, Dec 13 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

ఆసీస్ అదరహో...

ఆసీస్ అదరహో...

 వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో ఘన విజయం ప్యాటిన్సన్‌కు ఐదు వికెట్లు.

 హోబర్ట్:
దాదాపు తొమ్మిది నెలల తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ (5/27) తొలి టెస్టులో వెస్టిండీస్‌ను వణికించాడు. నిప్పులు చెరిగే బంతులతో కరీబియన్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ 212 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.  ఓవర్‌నైట్ స్కోరు 207/6తో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.
 
 దీంతో ఆసీస్‌కు 360 పరుగుల ఆధిక్యం దక్కింది. డారెన్ బ్రేవో (177 బంతుల్లో 108; 20 ఫోర్లు) సెంచరీ సాధించగా, కీమర్ రోచ్ (31) ఓ మాదిరిగా ఆడాడు. హాజెల్‌వుడ్ 4, లయోన్ 3 వికెట్లు తీశారు. తర్వాత ఫాలోఆన్‌కు దిగిన కరీబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. కేవలం 36.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్‌వైట్ (122 బంతుల్లో 94; 13 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ప్యాటిన్సన్ దెబ్బకు విండీస్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement