
18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన జింబాబ్వే ఓటమితో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. టౌన్స్ విల్లే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 47.3 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ మాధేవేరే 72 పరుగులతో రాణించడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ అయినా చేయగల్గింది.
ఇక ఆసీస్ బౌలర్లలో యువ కామెరాన్ గ్రీన్ ఐదు వికెట్లతో చేలరేగగా.. జంపా మూడు, మార్ష్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్ 48 పరుగులతో(నాటౌట్)గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బర్ల్ మూడు వికెట్లు పడగొట్టగా..రజా, నగర్వ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే ఇదే వేదికగా ఆగస్టు 31న జరగనుంది.
చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్!