
టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ఆఫ్గానిస్తాన్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ గాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో బౌండరీ ఆపే ప్రయత్నంలో రషీద్ ఖాన్ కాలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్‌ను వదిలి రషీద్ ఫిజియో సాయంతో బయటకు వెళ్లాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో మహ్మద్ నబీ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో రషీద్ 9 పరుగులతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆఫ్గాన్ ఓటమిపాలైంది. ఆఫ్గాన్ ఆడాల్సిన మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక తమ అఖరి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ నవంబర్ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
#SLvsBAN pic.twitter.com/J8Mw59RWgP
— The sports 360 (@Thesports3601) November 1, 2022
చదవండి: వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ కన్ను మూత
Comments
Please login to add a commentAdd a comment