మెల్‌బోర్న్:సోషల్‌మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. తమ దేశంలో 16 ఏళ్లలోపు చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా దిగువసభ సుదీర్ఘచర్చ అనంతరం పాస్ చేసింది.పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా నిషేధించడంపై దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ స్పందించారు.
తమ దేశంలో పిల్లల భద్రత ప్రశ్నార్థకంలో పడకుండా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్‌మీడియా నిషేధం బిల్లు పాసవ్వడంతో ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్,టిక్‌టాక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలలో ఇక నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు లాగిన్ అవడానికి వీల్లేదు.
ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫాంలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.లేదంటే ఆయా కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.ఈ నిషేధాన్ని జనవరి నుంచి ట్రయల్ పద్ధతిలో అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయి నిషేధం అమలులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment