కొడుకుని రనౌట్‌ చేసిన తండ్రి..! | shivnarine Chanderpaul hits a straight shot, runs out son Tagenarine | Sakshi
Sakshi News home page

కొడుకుని రనౌట్‌ చేసిన తండ్రి..!

Feb 24 2018 11:10 AM | Updated on Feb 24 2018 11:20 AM

shivnarine Chanderpaul hits a straight shot, runs out son Tagenarine - Sakshi

గయానా: వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌, అతని కొడుకు త్యాగనారాయణ్‌ చందర్‌పాల్‌ కొన్నేళ్లుగా కలిసి క్రికెట్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. కరీబియన్‌ దేశవాళీ క్రికెట్‌లో వీరిద్దరు గయానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, తాజాగా జరుగుతున్న సూపర్‌ ఫిఫ్టీ టోర్నీలో త్యాగనారాయణ్‌ను  శివనారాయణ్‌ చందర్‌ పాల్‌ రనౌట్‌ చేయడం వార్తల్లో నిలిచింది. శివనారాయణ్‌ స్టైట్‌ డ్రైవ్‌ ఆడగా, బంతిని అడ్డుకునే ప్రయత్నంలో బౌలర్‌ కాలు అడ్డుపెట్టాడు. అతడి కాలికి తాకిన బంతి బెయిల్స్‌ను పడగొట్టింది.

అప్పటికి క్రీజు బయట ఉన్న త్యాగనారాయణ్‌ రనౌటై వెనుదిరగాల్సి వచ్చింది. అసలు తండ్రి-కొడుకులు క్రికెట్‌ ఆడటమే అరుదైతే, కొడుకుని తండ్రి రనౌట్‌ చేయడం కాస్తా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement