
భారత మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబర్చినందుకు గాను అతనికి ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ క్లెయిర్ టేలర్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది.
భారత్ తరఫున ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఐదో క్రికెటర్ ద్రవిడ్. అంతకుముందు బిషన్ సింగ్ బేడి, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ‘ఎ’, అండర్–19 జట్లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్ దేశం తరఫున 164 టెస్టులకు ప్రాతినిథ్యం వహించి 13,288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి. 344 వన్డేల్లో 10,889 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment