హాల్ ఆఫ్ ఫేమ్‌లో సింప్సన్ | simpson in hall of fame | Sakshi
Sakshi News home page

హాల్ ఆఫ్ ఫేమ్‌లో సింప్సన్

Published Tue, Dec 31 2013 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

హాల్ ఆఫ్ ఫేమ్‌లో సింప్సన్

హాల్ ఆఫ్ ఫేమ్‌లో సింప్సన్

 దుబాయ్: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా తరఫున ఈ గౌరవం అందుకున్న 20వ, ఓవరాల్‌గా 72వ ఆటగాడు సింప్సన్. ఆయనతో పాటు న్యూజిలాండ్ మాజీ మహిళా క్రికెటర్ డెబీ హాక్లీని కూడా హాల్ ఆఫ్ ఫేమ్ కోసం ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో హాక్లీ నాలుగో మహిళా క్రికెటర్ కాగా, రిచర్డ్స్ హ్యడ్లీ తర్వాత రెండో న్యూజిలాండ్ క్రికెటర్ మాత్రమే కావడం విశేషం.
 
  ఆస్ట్రేలియా తరఫున 62 టెస్టుల్లో 4869 పరుగులు చేసిన సింప్సన్... ఆ జట్టు కోచ్‌గా వన్డే ప్రపంచకప్‌ను కూడా అందించారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ (311) చేసిన కొద్ది మంది ఆటగాళ్లలో ఆయన కూడా ఒకరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement