ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు | Alastair Cook, Neetu David And AB de Villiers Added To ICC Hall Of Fame | Sakshi
Sakshi News home page

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు

Published Wed, Oct 16 2024 3:50 PM | Last Updated on Wed, Oct 16 2024 5:18 PM

Alastair Cook, Neetu David And AB de Villiers Added To ICC Hall Of Fame

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ద ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు చేర్చింది. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్‌ అలిస్టర్‌ కుక్‌, సౌతాఫ్రికా లెజెండరీ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌, భారత దిగ్గజ స్పిన్నర్‌ నీతూ డేవిడ్‌ ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ద ఫేమర్‌లుగా ఎంపికయ్యారు.

అలిస్టర్‌ కుక్‌ (2006-18) ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ టెస్ట్‌ బ్యాటర్లలో ఒకరు. కుక్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో 161 టెస్ట్‌లు ఆడి 45.35 సగటున 12,472 పరుగులు చేశాడు. అలాగే 92 వన్డేల్లో 36.40 సగటున 3204 పరగులు చేశాడు. నాలుగు టీ20ల్లో 15.25 సగటున 61 పరుగులు చేశాడు.

నీతూ డేవిడ్‌ (1995-2008).. భారత్‌ తరఫున ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ద ఫేమర్ల జాబితాలో చేరిన రెండో మహిళా క్రికెటర్‌. 2023లో డయానా ఎడుల్జి భారత్‌ తరఫున హాల్‌ ఆఫ్‌ ద ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. నీతూ డేవిడ్‌ భారత్‌ తరఫున 10 టెస్ట్‌లు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు పడగొట్టింది. భారత్‌ తరఫున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌ నీతూనే.

ఏబీ డివిలియర్స్‌ (2004-2018) విషయానికొస్తే.. ఏబీడీ సౌతాఫ్రికా తరఫున 114 టెస్ట్‌లు, 228 వన్డేలు, 78 టీ20 ఆడి 20014 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఏబీడీ సగటు 50కి పైగానే ఉంది. మైదానం నలుమూలలా షాట్లు ఆడగల ఏబీడీకి మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌గా పేరుంది.

చదవండి: IND vs NZ 1st Test: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. తొలి రోజు ఆట రద్దు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement