'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు.. | 10 Legends From Five Eras To Be Inducted Into ICC Hall Of Fame In WTC Final | Sakshi
Sakshi News home page

'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు..

Published Thu, Jun 10 2021 6:31 PM | Last Updated on Thu, Jun 10 2021 7:01 PM

10 Legends From Five Eras To Be Inducted Into ICC Hall Of Fame In WTC Final - Sakshi

దుబాయ్‌: ప్రపంచ టెస్ట్ ఛాంపియ‌న్షిప్(డబ్ల్యూటీసీ) ఫైన‌ల్ సంద‌ర్భంగా పది మంది దిగ్గజ ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్‌ జాబితాలో చేర్చాల‌ని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్ ఐదు శ‌కాల‌ నుంచి ఇద్దరేసి ఆటగాళ్లకు ఈ గౌర‌వం దక్కనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హాల్ ఆఫ్ ఫేమ్‌ జాబితాలో 93 మంది దిగ్గజ ఆటగాళ్లుండగా, ఆ సంఖ్యను 103కు పెంచాలని నిర్ణయించింది. జూన్ 18న సౌథాంప్టన్‌లో జ‌ర‌గ‌బోయే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌ సందర్భంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్పెష‌ల్ ఎడిష‌న్ ఉంటుంద‌ని గురువారం ఐసీసీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. 

చారిత్రక మ్యాచ్‌(డబ్యూటీసీ ఫైనల్‌) సందర్భంగా.. క్రికెట్ చ‌రిత్రను సెల‌బ్రేట్ చేసుకోబోతున్నామని, ఇందులో భాగంగా క్రికెట్‌కు త‌మ వంతు సేవ‌లు అందించిన 10 మంది దిగ్గజాలను మనం సత్కరించుకోబోతున్నామని, వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యమని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ పేర్కొన్నారు. ఈ లెజండరీ ఆటగాళ్లు భ‌విష్యత్‌ తరాల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తారని ఆయన తెలిపారు. క్రికెట్‌ను ఐదు శ‌కాలుగా విభ‌జించామని, వాటిని ప్రారంభ క్రికెట్ శ‌కం (1918 కంటే ముందు), ఇంట‌ర్ వార్ క్రికెట్ శ‌కం (1918-1945), యుద్ధం త‌ర్వాత క్రికెట్ శ‌కం (1946-1970), వ‌న్డే క్రికెట్‌ శ‌కం(1971-1995), ఆధునిక క్రికెట్ శ‌కం (1996-2016)గా విభ‌జించామని వెల్లడించారు. ఈ ఐదు శకాల్లో ఒక్కో శ‌కం నుంచి ఇద్దరేసి ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక చేయ‌నున్నట్లు పేర్కొన్నారు. 

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఓటింగ్ అకాడ‌మీ, హాల్ ఆఫ్ ఫేమ్‌ జాబితాలో సజీవంగా ఉన్న స‌భ్యులు, ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న్ క్రికెట‌ర్స్‌ అసోసియేష‌న్ ప్రతినిధి, ప్రముఖ క్రికెట్ జ‌ర్నలిస్టులు, సీనియ‌ర్ ఐసీసీ స‌భ్యులు.. ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. అయితే వీరి ఓటింగ్‌ ఆధారంగా ఇప్పటికే ఆ ప‌ది మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని, జూన్‌ 13న ఈ జాబితాను ఐసీసీ డిజిట‌ల్ మీడియా ఛానెళ్ల ద్వారా లైవ్‌లో ప్రక‌టిస్తామని జెఫ్‌ వెల్లడించారు. 
చదవండి: సచిన్‌ నాకు 12 ఏళ్ల పిల్లాడిలా, క్యూట్‌గా కనిపించాడు.. అందుకే వెంటపడ్డా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement