Cricket legend
-
వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్!
ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ హడావుడి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ సందడి చేశారు. 1983లో తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కలిశారు. బ్యాట్ పట్టి వారితో సరదాగా క్రికెట్ ఆడారు. నాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1983 విజయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు సంకేతంగా తాను సంతకం చేసిన బ్యాట్‌ను లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, జిమ్మీ అమర్నాథ్, కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలకు బహూకరించారు. దీనికి సంబంధిచిన వీడియోను ఎరిక్ గార్సెట్టీ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి బాటలు వేశారంటూ 1983 వరల్డ్ కప్ నెగ్గిన లెజండరీ క్రికెటర్లను అభినందిస్తూ భారత్ మరోసారి ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఆడుతున్న తరుణంలో గార్సెట్టీ షేర్ చేసిన ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. అత్యధికంగా వ్యూవ్స్, లైక్స్ వచ్చాయి. అలాగే పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు. Met the OGs of cricket 🏏 – '83 legends @therealkapildev, Sunil Gavaskar, @iRogerBinny, @JimmyAmarnath, @KirtiAzaad, and @RaviShastriOfc! They bowled me over with their stories from India's first cricket World Cup victory! Rooting for #TeamIndia for the World Cup final on Sunday.… pic.twitter.com/71aTKDIuax — U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) November 17, 2023 -
బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్ అతడే..
Muttiah Muralitharan- 800 Wickets: అతడిది అసలు బౌలింగే కాదన్నారు. త్రో చేస్తున్నాడని, బౌలర్ కాదు జావెలిన్ త్రోయర్ అన్నారు. మోసంతో సాధించిన వికెట్లు, రికార్డులు అసలు లెక్కకే రావని, వాటిని పక్కన పడేయాలని విమర్శించారు. అతని కోసమే నిబంధనలు మార్చారని, అలా అయితే అది క్రికెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అడుగడుగునా అవమానాలు, మైదానంలోకి దిగితే చాలు స్టాండ్స్ నుంచి ప్రేక్షకుల బూతు పురాణాలు. కొందరు అతడిని తమిళ తీవ్రవాదిగానూ చిత్రించారు. క్రికెట్ చరిత్రలో ఇంతటి అవమానాలను ఎదుర్కొని, దోషిలా విచారణకు గురైన క్రికెటర్ మరెవరూ లేరు. కానీ ఇన్ని ఆటుపోట్ల మధ్య అతని సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు. పట్టుదలతో ప్రతికూల పరిస్థితులకు అతను ఎదురీదాడు. చివరకు అన్ని అడ్డంకులనూ అధిగమించి ఉన్నతస్థానానికి చేరాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కీర్తిని అందుకున్నాడు. అతడే ముత్తయ్య మురళీధరన్. అద్భుతమైన ఆట, ఘనతలతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీలంక ఆఫ్‌స్పిన్నర్. నాపై నాకు నమ్మకం ఉంది 2010 జులై 18 నుంచి గాలేలో భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్.. ఈ మ్యాచ్‌తోనే తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని మురళీధరన్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. సహచరులు అందరూ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నో సాధించి అప్పటికే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందిన అతనికి ఒక మైలురాయి పెద్ద ఘనత కాకపోవచ్చు. కానీ 800 అనే సంఖ్య చెప్పుకునేందుకు మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే అతను 800 వికెట్ల మార్క్ అందుకోవాలని వారు ఆశించారు. ఒక్క టెస్టులోనే 8 వికెట్లు కష్టమని, సిరీస్‌లో మరో రెండు టెస్టులు ఉన్నాయి కాబట్టి అది సాధించిన తర్వాతే రిటైర్ కావాలని, కనీసం 800 వచ్చాకే రిటైర్మెంట్ ప్రకటించాలని కూడా వారు సూచించారు. కానీ మురళీ వినలేదు. ‘నాపై నాకు నమ్మకం ఉంది’ అంటూ స్పష్టంగా చెప్పేశాడు. వికెట్‌కు అవకాశం లేని బంతులు వేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అతనికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కావాలి. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోగా, అతని ఖాతాలో మరో 2 వికెట్లు చేరాయి. చివరి వికెట్ మిగిలింది. అది తాము మాత్రం తీయరాదని బౌలర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. వికెట్‌కు అవకాశం లేని బంతులు వేస్తూ ఉడతాభక్తిగా సాయం చేస్తూ వచ్చారు. మురళీధరన్‌కు 800వ వికెట్ అతడే చివరకు అందరూ ఎదురు చూసిన క్షణం వచ్చింది. ప్రజ్ఞాన్ ఓఝా స్లిప్‌లో జయవర్ధనేకు క్యాచ్ ఇవ్వడంతో గాలే స్టేడియం దద్దరిల్లింది. స్టేడియం పక్కనే ఉండే సముద్ర ఘోష కూడా వినిపించని రీతిలో అభిమానులు హోరెత్తించారు. అది మురళీధరన్‌కు 800వ వికెట్. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, ఈ స్థితికి చేరేందుకు పడిన శ్రమ ఆ దిగ్గజ స్పిన్నర్‌ను భావోద్వేగానికి గురి చేశాయి. అలెన్ బోర్డర్‌ను ఆశ్చర్యపరచి.. పాఠశాల స్థాయిలో అందరిలాగే తానూ ఒక ఆటను ఎంచుకోవాలని మురళీ క్రికెట్ వైపు మొగ్గాడు. మీడియం పేస్ బౌలర్‌గా అతను మొదలు పెట్టినా స్కూల్ టీమ్‌లో స్పిన్నర్ అవసరాన్ని గుర్తించి కోచ్ అతడిని స్పిన్ వైపు మళ్లించాడు. దాంతో 14 ఏళ్ల వయసులో కొత్త విద్యపై అతను దృష్టి పెట్టాల్సి వచ్చింది. అయితే మురళీ పట్టుదలగా సాధన చేసి అందరి దృష్టిలో పడ్డాడు. వరుసగా వికెట్లు పడగొడుతూ ఉత్తమ ఆటగాడిగా నిలుస్తూ వచ్చాడు. తన కుటుంబ సభ్యుల నుంచి లభించిన గట్టి మద్దతు మురళీకి మేలు చేసింది. మరో ఆలోచన లేకుండా క్రికెట్‌పై దృష్టి పెట్టేలా చేసింది. బేకరీ వ్యాపారం చేస్తూ.. బేకరీ వ్యాపారం చేసే ముత్తయ్య నలుగురు కుమారుల్లో మురళీ ఒకడు. స్కూల్ స్థాయి దాటాక స్థానిక క్లబ్‌లలో కూడా సత్తా చాటి ఎదుగుతూ పోయిన అతనికి సహజంగానే శ్రీలంక ‘ఏ’ టీమ్‌లో అవకాశం లభించింది. అయితే ఆ తర్వాత అసలు సమయం వచ్చింది. 20 ఏళ్ల వయసులో మురళీ గురించి ప్రపంచానికి తెలిసింది. శ్రీలంక పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. అందులో మురళీని ఎంపిక చేశారు. నాటి దిగ్గజం, ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్ కూడా అతని బంతులను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. దాంతో లంక బోర్డు మరో ఆలోచన లేకుండా అనూహ్యంగా రెండో టెస్టులో అవకాశం కల్పించి అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టేలా చేసింది. అలా మొదలైన ఆ ప్రస్థానం సుదీర్ఘ కాలం పాటు సాగి రికార్డులను తిరగరాసింది. గింగిరాలు తిరిగే బంతితో.. మురళీధరన్ బౌలింగ్ శైలే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా ఆఫ్ స్పిన్నర్లు వేలితోనే బంతిని స్పిన్ చేస్తారు. అందుకే వారిని ఫింగర్ స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. అయితే మణికట్టును ఎక్కువగా వాడుతూ స్పిన్ బౌలింగ్ చేసే అరుదైన ప్రజ్ఞ అతని సొంతం. ఎలాంటి పిచ్ మీదైనా బంతిని అసాధారణంగా టర్న్ చేయగల నైపుణ్యం అతనికి పెద్ద సంఖ్యలో వికెట్లను అందించింది. మారథాన్ స్పెల్స్ వేయగలడు సుదీర్ఘ సమయం పాటు విరామం లేకుండా మారథాన్ స్పెల్స్ వేయగల సామర్థ్యం అతని సొంతం. అందుకే అరడజను మంది లంక కెప్టెన్లకు ఎప్పుడైనా అతనే ప్రధాన ఆయుధం. అతడిని సమర్థంగా వాడుకున్న వారంతా నాయకులుగా గొప్ప విజయాలను తమ ఖాతాలో వేసుకోగలిగారు. తర్వాతి రోజుల్లో దూస్రా అనే పదునైన ఆయుధం మురళీ అమ్ముల పొదిలోకి చేరింది. 20 వికెట్లు మురళి ఖాతాలో ఉండాల్సిందే సమకాలీనుల్లో స్పిన్‌ను బాగా ఆడగలరని పేరున్న బ్యాటర్లందరూ మురళీని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డవారే. అతని స్పిన్ దెబ్బకు ఎన్నో కెరీర్లు ముగిశాయంటే అతిశయోక్తి కాదు. ఒక మూడు టెస్టుల సిరీస్ జరిగిందంటే కనీసం 20 వికెట్లు మురళి ఖాతాలో ఉండాల్సిందే. శ్రీలంక వరుసగా చిరస్మరణీయ విజయాలు సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పెద్దన్నలా అండగా.. ముఖ్యంగా అర్జున రణతుంగ కెప్టెన్సీలో మురళీ స్థాయి పెరిగింది. ‘ఒక పెద్దన్నలా అతను నాకు అండగా నిలబడ్డాడ’ని రణతుంగ గురించి మురళీ చాలా సార్లు చెప్పుకున్నాడు. 1996 వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకున్న శ్రీలంక జట్టులో మురళీధరన్ కూడా ఉన్నాడు. రికార్డులే రికార్డులు.. అంతర్జాతీయ క్రికెట్లో మురళీధరన్ సాధించిన ఘనతల జాబితా చాలా పెద్దది. టెస్టులు, వన్డేలు, టి20లు కలిపి 1347 వికెట్లు తీసిన ఘనత అతని సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ఇది. ఆ ఘనతకు గీటురాళ్లు ఎన్నో 11 సార్లు టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవడం, వరుసగా 4 టెస్టుల్లో పదికి పైగా వికెట్లు పడగొట్టడం, అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 63,132 బంతులు వేయడం, టెస్టు కెరీర్లో ఒక టెస్టులో పదేసి వికెట్లు 22 సార్లు పడగొట్టడం, ఒక ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు 67 సార్లు తీయడం.. ఇలా ఒకటా, రెండా ఆ ఘనతకు గీటురాళ్లు ఎన్నో అతని సుదీర్ఘమైన కెరీర్లో! సునామీ వచ్చినప్పుడు సొంత ఖర్చులతో 2002లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో అతను తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసి త్రుటిలో 10 వికెట్ల అవకాశం కోల్పోయాడు. ఆటతోనే కాకుండా సమాజ సేవతోనూ మురళీకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ముఖ్యంగా 2004లో శ్రీలంకలో సునామీ వచ్చినప్పుడు అతను సొంత ఖర్చులతో ప్రత్యేక శ్రద్ధ చూపించి చేపట్టిన సహాయ కార్యక్రమాలు శ్రీలంక దేశవాసుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి. ‘800’ అనే సినిమా కేవలం డబ్బు ప్రకటనతో సరిపెట్టకుండా అతను పడిన శ్రమ, ఇచ్చిన సమయం అతని సహాయ కార్యక్రమం విలువేమిటో చూపించాయి. సునామీ సహాయక కార్యక్రమం కోసమే అప్పటికప్పుడు దేశంలోని నంబర్‌వన్ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమై.. వారితో ఒప్పందం చేసుకోవడం విశేషం. ఇటీవలే మురళీ కెరీర్‌పై వచ్చిన ‘800’ అనే సినిమా కూడా అతని ఘనతలను చూపిస్తుంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
క్రికెటర్ చెంపపై ఆటోగ్రాఫ్ నిరాకరించిన క్వీన్ ఎలిజబెత్-2
బ్రిటన్ను 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్–2 96 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వేసవి విరామం కోసం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. ఇదిలాఉంటే 70 ఏళ్ల పాలనలో ఎన్నో చూసిన క్వీన్ ఎలిజబెత్‌కు క్రీడలతోనూ మంచి అనుబంధం ఉంది. ఆటలకు అతీతంగా ఆమె క్రీడాకారులను ప్రోత్సహించేది. ఇక క్రికెట్‌తోనూ బంధం ముడిపడి ఉన్న క్వీన్ ఎలిజబెత్.. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన ప్రతీ జట్టును తన నివాసమైన బకింగ్హమ్ ప్యాలెస్‌కు పిలిపించుకునేది. వారితో ఫోటో సెషన్ అనంరతం అతిథి మర్యాదలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే క్వీన్ ఎలిజబెత్-2 గురించి ఒక ఆసక్తికర విషయం తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డెన్నిస్ లిల్లీకి.. క్వీన్ ఎలిజబెత్-2తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1977లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సెంటనరీ టెస్టు మ్యాచ్ నిర్వహించారు. ఆ మ్యాచ్‌కు క్వీన్ ఎలిజబెత్-2 ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లను రాణి ఎలిజబెత్ పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ తనను తాను పరిచయం చేసుకొని.. ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ అతని చెంపను చూపించాడు. అయితే ప్రోటోకాల్ సమస్య వల్ల క్వీన్ ఎలిజబెత్ ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తర్వాత తన రాయబారితో సంతకంతో కూడిన ఫోటోగ్రాఫ్‌ను డెన్నిస్ లిల్లీకి పంపించడం అప్పట్లో ఆసక్తి కలిగించింది. తాజాగా క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై స్పందించిన డెన్నిస్ లిల్లీ మరోసారి రాణితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చకున్నాడు. ఇక క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో శుక్రవారం ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దుచేశారు. క్వీన్ ఎలిజబెత్ మరణంపై స్పందించిన ఈసీబీ.. ''రాణి ఎలిజబెత్-2 ఇక లేరన్న దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఆమె మృతికి నివాళి అర్పిస్తూ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నాం. వీటితో పాటు ఇంగ్లండ్‌లో జరిగే మిగతా టోర్నీలోని మ్యాచ్‌లను కూడా రద్దు చేశాం. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కులర్ జారీ చేశాం'' అని తెలిపింది. The England and Wales Cricket Board is deeply saddened at the death of Her Majesty Queen Elizabeth II. The thoughts of everyone involved in the game are with the whole Royal Family. — England and Wales Cricket Board (@ECB_cricket) September 8, 2022 చదవండి: Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఇకలేరు రాజరికంలో క్వీన్ ఎలిజబెత్-2 సరికొత్త రికార్డు.. ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలివే! -
'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు..
దుబాయ్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ సందర్భంగా పది మంది దిగ్గజ ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చాలని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్ ఐదు శకాల నుంచి ఇద్దరేసి ఆటగాళ్లకు ఈ గౌరవం దక్కనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో 93 మంది దిగ్గజ ఆటగాళ్లుండగా, ఆ సంఖ్యను 103కు పెంచాలని నిర్ణయించింది. జూన్ 18న సౌథాంప్టన్‌లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ స్పెషల్ ఎడిషన్ ఉంటుందని గురువారం ఐసీసీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. చారిత్రక మ్యాచ్(డబ్యూటీసీ ఫైనల్) సందర్భంగా.. క్రికెట్ చరిత్రను సెలబ్రేట్ చేసుకోబోతున్నామని, ఇందులో భాగంగా క్రికెట్‌కు తమ వంతు సేవలు అందించిన 10 మంది దిగ్గజాలను మనం సత్కరించుకోబోతున్నామని, వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యమని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ పేర్కొన్నారు. ఈ లెజండరీ ఆటగాళ్లు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయన తెలిపారు. క్రికెట్‌ను ఐదు శకాలుగా విభజించామని, వాటిని ప్రారంభ క్రికెట్ శకం (1918 కంటే ముందు), ఇంటర్ వార్ క్రికెట్ శకం (1918-1945), యుద్ధం తర్వాత క్రికెట్ శకం (1946-1970), వన్డే క్రికెట్ శకం(1971-1995), ఆధునిక క్రికెట్ శకం (1996-2016)గా విభజించామని వెల్లడించారు. ఈ ఐదు శకాల్లో ఒక్కో శకం నుంచి ఇద్దరేసి ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఓటింగ్ అకాడమీ, హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో సజీవంగా ఉన్న సభ్యులు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి, ప్రముఖ క్రికెట్ జర్నలిస్టులు, సీనియర్ ఐసీసీ సభ్యులు.. ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. అయితే వీరి ఓటింగ్ ఆధారంగా ఇప్పటికే ఆ పది మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని, జూన్ 13న ఈ జాబితాను ఐసీసీ డిజిటల్ మీడియా ఛానెళ్ల ద్వారా లైవ్‌లో ప్రకటిస్తామని జెఫ్ వెల్లడించారు. చదవండి: సచిన్ నాకు 12 ఏళ్ల పిల్లాడిలా, క్యూట్‌గా కనిపించాడు.. అందుకే వెంటపడ్డా -
ఉప్పొంగిన అభిమానం
‘సచిన్ జిందాబాద్.. ఉయ్ వాంట్ సచిన్’ నినాదాలతో పుట్టంరాజువారి కండ్రిగ మార్మోగింది. క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ రమేష్ టెండుల్కర్ ఆదివారం దత్తత గ్రామమైన పీఆర్ కండ్రిగలో రెండు గంటల పాటు పర్యటిం చారు. ఎక్కడో క్రికెట్ ఆడుతుంటే.. అతని ఆటను చూసేందుకు టీవీలకు అతుక్కుని చూస్తూ.. సెంచరీ కొట్టాలని దేవుళ్లను ప్రార్థించే అభిమానులు.. ఆ అభిమాన క్రికెటర్ సచిన్ నేరుగా పీఆర్ కండ్రిగకు రావడంతో ప్రజలు పులకించిపోయారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సచిన్ రాక కోసం నెలరోజులుగా ఎదురుచూస్తున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామస్తులు, పరిసర ప్రాంతవాసులు ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామం పొలిమేర నుంచి అభిమానులు సచిన్ కోసం ఎదురుచూడటం కనిపించింది. తన అభిమాన క్రికెటర్ కోసం అభిమానులు, ఎమ్మెల్యే భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సచిన్ ఫొటోతో మాస్క్‌లను పంపిణీ చేశారు. వాటిని ధరించిన యువత సచిన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఫ్లెక్సీలు గూడూరు పొలిమేర నుంచి ఏర్పాటు చేసి ఉండటం కనిపించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కృష్ణపట్నం పోర్టు నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు పీఆర్ కండ్రిగకకు కారులో చేరుకున్నారు. సచిన్ రాక కోసం ఎదురుచూస్తున్న జనం ఒక్కసారిగా ‘సచిన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా ‘ఉయ్ వాంట్ సచిన్’ అంటూ కేకలు వేశారు. పోలీసులు ఆంక్షలు విధించడంతో అభిమానులు బారికేడ్లకు ఇరువైపుల సచిన్ చూసేందుకు బారులు తీరారు. సచిన్ నడుస్తూ గ్రామంలోకి వెళ్తుంటే అభిమానులు ‘సచిన్ సార్.. సార్ సచిన్ గారూ’ ఆయన చూపు కోసం పిలువటం కనిపించింది. అభిమానుల పిలుపు విన్న సచిన్ వారికి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. సచిన్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు, గ్రామస్తులు పోటీపడ్డారు. గ్రామస్తులతో మమేకం దత్త గ్రామమైన పుట్టంరాజువారికండ్రిగలో పర్యటించిన సచిన్ స్థానికులతో మమేకమయ్యారు. గ్రామంలో పైలాన్‌ను సచిన్ ప్రారంభించాల్సి ఉంది. సచిన్ ఓ చిన్నారితో ప్రారంభింపజేశారు. అనంతరం నేరుగా గిరిజనకాలనీకి వెళ్లి పూరిపాకలో నివసిస్తున్న రాజేశ్వరి కుటుంబాన్ని పలుకరించారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అలాగేవిజయమ్మ, రత్నమ్మ నివాసానికి వెళ్లి వారినీ పలుకురించారు. అక్కడి నుంచి చెరువులో చేపపిల్లలను విడిచి గ్రామస్తులకు ఉపాధి మార్గాన్ని చూపారు. అక్కడ మత్స్యకారులు మంత్రి నారాయణచేత చేప బొమ్మను సచిన్‌కు బహూకరించారు. అక్కడి నుంచి నేరుగా పాడిరైతుల వద్దకు వెళ్లారు. గోమాతకు పూజచేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఇద్దరు గర్భిణులకు శ్రీమంతం చేయటంతో స్థానికులు మురిసిపోయారు. ఆ ఇద్దరు మహిళలు సైతం సొంత సోదరుడు శ్రీమంతం నిర్వహించిన అనుభూతిని పొందారు. అంతకు ముందు గ్రామానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తరువాత గ్రామస్తుల మధ్యకెళ్లి పీఆర్ కండ్రిగను దత్తత తీసుకోవటానికి గల కారణాలను వివరించారు. ఈ మొత్తం కార్యక్రమం పూర్తయ్యే వరకు అభిమానులు సచిన్ కోసం పరుగులు తీయటం కనిపించింది. ఆయన చుట్టూ చేరి జిందాబాద్‌లు కొడుతూ గడిపారు. పోలీసులు, అధికారుల ఓవర్ యాక్షన్‌తో ముఖాముఖి రద్దు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను చూరగొన్న గొప్ప క్రికెటర్ పర్యటన అంటే ఆషామాషీ కాదు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాల్సిన అధికారయంత్రాంగం విఫలమైందని చెప్పొచ్చు. కొంత దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి వదిలేశారు. సచిన్‌ను కలవాలనుకున్న వారు ఎటువైపునుంచైనా వచ్చే అవకాశాలు కనిపించాయి. పోలీసులు, అధికారులు కొందరు కేవలం మీడియాకు ఆంక్షలు విధించాలని చూశారే తప్ప భద్రతను గాలికొదిలేశారని సచిన్ తో పాటు వచ్చిన కొందరు ముఖ్యులు చర్చించుకోవటం కనిపించింది. మూడు గంటల పాటు సాగాల్సిన సచిన్ కార్యక్రమం రెండు గంటలకే ముగించాల్సి వచ్చింది. రైతులతో ముఖాముఖి రద్దైం ది. సచిన్ కోసం ఆశగా ఎదురుచూసిన చిన్నారులకు నిరుత్సాహం మిగిలింది. కేవలం అధికారులు ఓవర్ యాక్షన్ కారణంగా గ్రామస్తులతో ముఖాముఖి, యువతతో క్రికెట్ ఆడే కార్యక్రమాలు రద్దయ్యాయని స్థానికులు నిరాశ వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కొంత సమయం గడిపేందుకు హెలికాప్టర్‌ను సైతం వదిలి గతుకుల రోడ్డుపై ప్రయాణం చేసి పీఆర్ కండ్రిగకు వచ్చిన సచిన్‌కు అధికారుల తీరు కొంత నిరుత్సాహానికి గురిచేసిందని, అందుకే ఆయన రెండుగండలకే కార్యక్రమాన్ని ముగించుకుని వెనుదిరిగారని ప్రచారం సాగింది. -
నేడు కండ్రిగ గ్రామానికి సచిన్ రాక
నెల్లూరు: ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, రాజ్యసభ సభ్యుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆదివారం నెల్లూరు జిల్లాలోని పుట్టరాజువారి కండ్రిగ గ్రామాన్ని సందర్శించనున్నారు. సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సచిన్ ఆదివారం గ్రామంలో పర్యటించనున్నారు. అందుకు సచిన్ శనివారం సాయంత్రం కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. ఆ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సచిన్ పాల్గొననున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రజలతో సచిన్ ప్రతిజ్ఞ చేయించనున్నట్టు సమాచారం. కాగా, ఆయన రాక కోసం.. క్రీడాభిమానులు, గ్రామస్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సచిన్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మేరకు జిల్లా అధికారులు పుట్టంరాజువారి కండ్రిగలో తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు -
సచిన్ రాకకోసం సర్వం సిద్ధం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పర్యటనకు పుట్టంరాజువారి కండ్రిగను సిద్ధం చేశారు. ఆ మేరకు ఏర్పాట్లను పూర్తి చేశారు. పర్యటనలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. గ్రామంలో పర్యటించే ప్రాంతమంతా ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యుడు సచిన్టెండూల్కర్ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద పుట్టంరాజువారికండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో స్థానికులతో ముచ్చటించటంతో పాటు.. గ్రామాన్ని చూడాలనే ఉద్దేశంతో సచిన్ నేడు పుట్టంరాజువారికండ్రిగకు చేరుకోనున్నారు. ఉదయం 9 గంటలకు గ్రామానికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానికులతో గడపనున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. విద్యాభ్యాసం ఎలా నడుస్తుందో విద్యార్థులను అడిగి తెలుసుకోనున్నారు. విద్యార్థులతో క్రికెట్ ఆడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా త్రాగునీటి పైప్లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫుట్‌పాత్, విద్యుత్ దీపాలు, క్రికెట్ స్టేడియం, వ్యాపార సముదాయం, సామూహిక చెత్తవేసేందుకు కంపోస్ట్‌యార్డు వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సచిన్ టెండూల్కర్ పర్యటన సందర్భంగా మంత్రి నారాయణ, కలెక్టర్ శ్రీకాంత్, ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ పరిశీలించారు. సచిన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కూడిని పోలీసు బృందం సచిన్ భద్రత కోసం నియమించారు. ప్రతి 20 నుంచి 30 మీటర్లకు పోలీసులు ఉంటారు. సచిన్ రాక సందర్భంగా రాకపోకలను దారి మళ్లించారు. పుట్టంరాజువారికండ్రిగలో అధికారయంత్రాంగం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్లో కీర్తి గడించిన సచిన్ టెండూల్కర్ ఓ మారు గ్రామాన్ని దత్తత తీసుకోవటంతో జిల్లా అధికారయంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అందుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. ఆయన రాక సందర్భంగా ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం వారం రోజులపాటు గ్రామంలోనే తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్, జేసీ, ఏజేసీ, ఆర్డీఓ, ఎంపీడీఓ, తహశీల్దార్లతో పాటు వీఆర్వోలు, ఐకేపీ సిబ్బంది, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, విద్య, వైద్యశాఖ అధికారులతో పాటు పోలీసులు సచిన్ పర్యటనను విజయవంతం చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. సచిన్ పర్యటనను విజయవంతం చేసేందుకు గ్రామస్తులు కూడా అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. -
నేడు, రేపు నెల్లూరు జిల్లాలో సచిన్ పర్యటన
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నేడు, రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు సచిన్ శనివారం సాయంత్రం కృష్ణపట్నం పోర్టుకు చేరుకోని అక్కడే బస చేయనున్నారు. అయితే సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సచిన్ ఆదివారం గ్రామంలో పర్యటించనున్నారు. ఆయన రాక కోసం.. క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సచిన్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మేరకు జిల్లా అధికారులు పుట్టంరాజువారి కండ్రిగలో తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. -
సచిన్ కోసం చకచక..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మేరకు జిల్లా అధికారులు పుట్టంరాజువారి కండ్రిగలో తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సచిన్ ఆదివారం గ్రామంలో పర్యటించనున్నారు. అందుకు సచిన్ శనివారమే జిల్లాకు చేరుకుని కృష్ణపట్నం పోర్టులో బసచేయనున్నారు. గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఇప్పటికే గ్రామంలో కొత్తగా సిమెంటు రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే అది అసంపూర్తిగా దర్శనమిస్తోంది. సిమెంటు రోడ్డు వేసిన వరకు ఇరువైపులా చిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే ఫుట్‌పాత్ కూడా ఏర్పాటు చేసేందుకు అవసరమైన సిమెంటు రాళ్లను తీసుకొచ్చారు. అదేవిధంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కోసం గ్రామంలో జేసీబీతో పెద్దపెద్ద కాలువలు తీసి ఉంచారు. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం అంతా సిద్ధం చేసి ఉన్నారు. స్కూల్ ప్రహరీగోడ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. స్కూలు భవనం, ఆటస్థలం పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రెండురోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పనులు ముందుకు సాగలేదు. గ్రామం అంతా బురదమయమై చిత్తడి చిత్తడిగా దర్శనమిస్తోంది. కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ ఆదివారం పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ శుక్రవారం గ్రామంలో పర్యటించారు. కలెక్టర్, జేసీ గ్రామంలో పలువురి నివాసాలకు వెళ్లి పలుకరించారు. గ్రామం ముఖద్వారం ముందు ఏర్పాటు చేస్తున్న పైలాన్ పనులను పర్యవేక్షించారు. సచిన్ ఆదివారం ఉదయం గ్రామంలోకి ప్రవేశించగానే పైలాన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం నేరుగా స్వయంసహాయక సంఘాలు, రైతులు, విద్యార్థులతో ముఖాముఖి ఉంటుంది. అందుకు సంబంధించి కలెక్టర్, జేసీ ముందుగా ఎవరితో మాట్లాడించాలనే విషయంపై చర్చించారు. గ్రామంలో రచ్చబండ వద్ద రైతులు, అటువైపు మహిళలు, ఆ తరువాత విద్యార్థులతో మాట్లాడించాలని నిర్ణయించారు. ఆ తరువాత వర్షం లేకపోతే విద్యార్థులు, యువతతో సచిన్ కాసేపు క్రికెట్ ఆడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికులతో కలెక్టర్ మాటా మంతి.. కలెక్టర్ః పాపా నీపేరేంటి? పాపః సుహాసిని కలెక్టర్ః స్కూలుకెళ్తున్నావా? సుహాసినః లేదు సార్ కలెక్టర్ః ఎందుకెళ్లలేదు? ఏమ్మా పాపను స్కూలుకు పంపడం లేదా? పద్మమ్మః ఏడాదిగా స్కూలుకు పంపలేదు సార్ కలెక్టర్ః ఎందుకు? పద్మమ్మః కష్టంగా ఉంది సార్ కలెక్టర్ః అబ్బే.. అలా కాదు. రేపటి నుంచి పాపను స్కూలుకు పంపండి. గూడూరులో హాస్టల్లో ఉంచి బాగా చదివిస్తాం. పద్మమ్మ, సుహాసినిః మౌనం కలెక్టర్ః ఇంట్లో ఏంటి పొగ పద్మమ్మః వంటి చేస్తున్నాం సార్ కలెక్టర్ః గ్యాస్ లేదా? పద్మమ్మః లేదు సార్ కలెక్టర్ః మంటలురేగి అంటుకుంటే ప్రమాదం కదా? పీఏగారూ.. వీరికి గ్యాస్ ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉన్న గిరిజనులకు పక్కా గృహాలు మంజూరయ్యాయి. గ్రామంలో పనులు పూర్తవుతూనే పక్కా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలి. చెంచుక్రిష్ణమ్మః సారూ.. నాకు పింఛను రాలేదు సార్ కలెక్టర్ః ఎందుకమ్మా? ఒకే నీకు పింఛను వచ్చేలా చూస్తాను. ఇలా కలెక్టర్ గ్రామంలో పలువురిని పలకరిస్తూ పనులను పర్యవేక్షించారు. జిల్లా అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
సునిల్ గవాస్కర్‌తో ఓ రోజు...
కామన్‌గా ఫ్యాన్స్‌ను మురిపించే అందాల తార కాజల్ అగర్వాల్... తానే థ్రిల్లైపోయింది. క్రికెట్ లెజండ్ సునిల్ గవాస్కర్‌తో ఓ రోజు గడిపి... తెగ అదై పోయింది. ఇరవై నాలుగు గంటల్లో రెండు సార్లు ఆయనతో స్పెండ్ చేసే అవకాశం దొరికిందని ఉబ్బితబ్బిబై పోతోంది. ఫ్లయిట్లో ఆయనతో సెల్ఫీ దిగి... ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. ‘ఇటీవల మిస్టర్ సునిల్ గవాస్కర్‌ను కలిశా. అదీ ఒకే రోజులో రెండు సార్లు. ఎంతో ఎక్సైటింగ్‌గా ఫీలయ్యా. ఇక ఫొటో తీసుకోకుండా ఎలా ఉంటాను! ట్రావెలింగ్‌లో ఆయనుంటే ఎంతో ఫన్’ అంటూ ట్వీట్ చేసిందీ చిలిపి కళ్ల సుందరి. టైమ్ టూ పార్టీ! ఇప్పటి వరకు కలసి ఒక్క సినిమా చేయకపోయినా దోస్తానా బానే ఉంది తమిళ కుట్టి త్రిష, హీరో ధనుష్‌ల మధ్య. ఇటీవల చెన్నైలోని ఓ పార్టీలో వీరిద్దరూ... అదిరిపోయే మ్యూజిక్కు.. చిందులేసి.. చిల్లై... థ్రిల్లై.. రచ్చ రంబోలా చేసేశారు. పార్టీలో ‘ఫుల్లు’గా ఆస్వాదించిన మూమెంట్స్‌ను వారే ‘క్లిక్’మనిపించారు కూడా. మంచి స్నేహానికి మారుపేరుగా నిలిచే తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు వీరి స్నేహం ‘హాట్’ టాపిక్‌గా మారింది. ఏదిఏమైనా కోలీవుడ్ అంతా ఇలా కలసి హ్యాపీ ఫ్యామిలీలా ఎంజాయ్ చేసేస్తుంటే... అది చూసి అభిమానులు ఆహా అనుకొంటున్నారట. సేమ్ టూ సేమ్! కథలు... సినిమాలు... కాపీ కొట్టడం వరకు ఓకే! ఇదేంటీ అమ్మడు రాధికాగాంధీ మరీ అంతిదిగా ‘బెడ్ రూమ్ పోజ్’ కాపీ కొట్టేసింది! బెడ్‌పై వాలి... అదో రకమైన ఫీలింగ్‌తో కరెంట్ పాస్ చేసే పోజులివ్వడం శాండల్‌వుడ్ స్టార్ హీరోయిన్ పూజాగాంధీ స్పెషాలిటీ. ఒకరకంగా ఆమె కాపీరైట్ పోజిది. సేమ్ టూ సేమ్ ఆ సెక్సీ పోజ్‌ను దించేసింది ఆమె సోదరి రాధికాగాంధీ. కావాలని చేసిందో... సిట్యువేషన్ డిమాండ్ చేసిందో గానీ.. మొత్తానికి టాక్ ఆఫ్ ద టౌన్ అయిందిప్పుడీ భామ.