నేడు, రేపు నెల్లూరు జిల్లాలో సచిన్ పర్యటన
నెల్లూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ నేడు, రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అందుకు సచిన్ శనివారం సాయంత్రం కృష్ణపట్నం పోర్టుకు చేరుకోని అక్కడే బస చేయనున్నారు. అయితే సంసాద్ ఆదర్శ గ్రామయోజన పథకం కింద సచిన్‌టెండూల్కర్ పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సచిన్ ఆదివారం గ్రామంలో పర్యటించనున్నారు.
ఆయన రాక కోసం.. క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సచిన్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మేరకు జిల్లా అధికారులు పుట్టంరాజువారి కండ్రిగలో తిష్టవేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నారు.