సునిల్ గవాస్కర్‌తో ఓ రోజు...
కామన్‌గా ఫ్యాన్స్‌ను మురిపించే అందాల తార కాజల్ అగర్వాల్... తానే థ్రిల్లైపోయింది. క్రికెట్ లెజండ్ సునిల్ గవాస్కర్‌తో ఓ రోజు గడిపి... తెగ అదై పోయింది. ఇరవై నాలుగు గంటల్లో రెండు సార్లు ఆయనతో స్పెండ్ చేసే అవకాశం దొరికిందని ఉబ్బితబ్బిబై పోతోంది.
ఫ్లయిట్‌లో ఆయనతో సెల్ఫీ దిగి... ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘ఇటీవల మిస్టర్ సునిల్ గవాస్కర్‌ను కలిశా. అదీ ఒకే రోజులో రెండు సార్లు. ఎంతో ఎక్సైటింగ్‌గా ఫీలయ్యా. ఇక ఫొటో తీసుకోకుండా ఎలా ఉంటాను! ట్రావెలింగ్‌లో ఆయనుంటే ఎంతో ఫన్’ అంటూ ట్వీట్ చేసిందీ చిలిపి కళ్ల సుందరి.
టైమ్ టూ పార్టీ!
ఇప్పటి వరకు కలసి ఒక్క సినిమా చేయకపోయినా దోస్తానా బానే ఉంది తమిళ కుట్టి త్రిష, హీరో ధనుష్‌ల మధ్య. ఇటీవల చెన్నైలోని ఓ పార్టీలో వీరిద్దరూ... అదిరిపోయే మ్యూజిక్‌కు.. చిందులేసి.. చిల్లై... థ్రిల్లై.. రచ్చ రంబోలా చేసేశారు. పార్టీలో ‘ఫుల్లు’గా ఆస్వాదించిన మూమెంట్స్‌ను వారే ‘క్లిక్’మనిపించారు కూడా. మంచి స్నేహానికి మారుపేరుగా నిలిచే తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు వీరి స్నేహం ‘హాట్’ టాపిక్‌గా మారింది. ఏదిఏమైనా కోలీవుడ్ అంతా ఇలా కలసి హ్యాపీ ఫ్యామిలీలా ఎంజాయ్ చేసేస్తుంటే... అది చూసి అభిమానులు ఆహా అనుకొంటున్నారట.
సేమ్ టూ సేమ్!
కథలు... సినిమాలు... కాపీ కొట్టడం వరకు ఓకే! ఇదేంటీ అమ్మడు రాధికాగాంధీ మరీ అంతిదిగా ‘బెడ్ రూమ్ పోజ్’ కాపీ కొట్టేసింది! బెడ్‌పై వాలి... అదో రకమైన ఫీలింగ్‌తో కరెంట్ పాస్ చేసే పోజులివ్వడం శాండల్‌వుడ్ స్టార్ హీరోయిన్ పూజాగాంధీ స్పెషాలిటీ. ఒకరకంగా ఆమె కాపీరైట్ పోజిది. సేమ్ టూ సేమ్ ఆ సెక్సీ పోజ్‌ను దించేసింది ఆమె సోదరి రాధికాగాంధీ. కావాలని చేసిందో... సిట్యువేషన్ డిమాండ్ చేసిందో గానీ.. మొత్తానికి టాక్ ఆఫ్ ద టౌన్ అయిందిప్పుడీ భామ.