సిడ్నీ: ఇంకా వరల్డ్‌కప్ ప్రారంభం కావడానికి దాదాపు మూడు నెలల సమయం ఉండగానే ఏ జట్టు టైటిల్ గెలుస్తుందనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు క్రీడా విశ్లేషకులు వరల్డ్‌కప్ గెలిచే సత్తా భారత్, ఇంగ్లండ్ జట్లకు మాత్రమే ఉందని స్పష్టం చేయగా, ఆ జాబితాలో ఇప్పుడు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా చేరిపోయాడు. మెగా టైటిల్‌ను ఎగురేసుకుపోయే జాబితాలో భారత్, ఇంగ్లండ్ జట్లు ముందు వరుసలో ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌కు హాట్ ఫేవరెట్స్‌గా బరిలో దిగుతున్నాయన్నాడు. ఇక ఆసీస్‌కు కూడా అవకాశాలు లేకపోలేదని తెలిపాడు. అయితే ఇక్కడ తాను అనుకున్న జట్టుతో ఆసీస్ పోరుకు సిద్ధమైతే వరల్డ్‌కప్ వేటలో తమ జట్టు కూడా ఫేవరెట్‌గా ఉంటుందన్నాడు.
‘ఈసారి భారత్, ఇంగ్లండ్ జట్లు ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు గట్టిపోటీ ఇచ్చే జట్లే. ఇరు జట్లలోనూ మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. అయితే ఆసీస్ సెలక్టర్లు వారి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఆసీస్ కప్ గెలవడానికి 100శాతం అవకాశముంది. ప్రధానంగా భారత్, ఇంగ్లండ్‌లతో పాటు ఆసీస్ కూడా వరల్డ్‌కప్ గెలిచే అవకాశం ఉంది’ అని షేన్ వార్న్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment