సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తిరిగి చేరడం దాదాపు ఖాయం కావడంతో వరల్డ్‌కప్‌లో తామే మళ్లీ హాట్ ఫేవరెట్స్‌మని ఆ దేశ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ స్పష్టం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న తమ జట్టు.. దాన్ని నిలబెట్టుకుంటుందని ధీమా వ‍్యక్తం చేశాడు. ‘ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ల పునరాగమనంతో మా జట్టు మరింత బలోపేతం అవడం ఖాయం. వరల్డ్‌కప్‌కు వెళ్లే మా జట్టులో వారిద్దరూ కీలక ఆటగాళ్లు. నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో వీరిపై ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో వారిపై నిషేధం తొలగిపోనుంది. ఇక్కడ 2003లో తాను డోప్ టెస్టులో పాజిటివ్‌గా రావడంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయాన్ని వార్న్ ప్రస్తావించాడు. ‘ఆ సమయంలో డోపీగా తేలడంతో నాపై 12 నెలల నిషేధం విధించారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో నా మార్క్ స్పిన్‌తో సత్తా చాటా. ఈ నిషేధాన్ని నాలాగే ఉపయోగించుకోవచ్చు. మరింత తాజాదనంతో వారు ఫీల్డ్‌లోకి అడుగుపెట్టడం ఖాయం. ఈ క్రమంలోనే వారు రెచ్చిపోయి ఆడతారు. వారికి క్రికెట్ ఎంత ముఖ్యమో తెలుసు. ఇప్పుడు వారిద్దరికీ నిరూపించుకొనే అవకాశం వచ్చింది. తొలుత కొన్ని మ్యాచుల్లో ఆందోళన ఉంటుంది. ఇది వారికి మంచి చేస్తుంది. ఆ తర్వాత వారు అద్భుతంగా ఆడతారు’ అని షేన్‌వార్న్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment