లండన్: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. అదేంటి షేన్ వార్న్ క్రికెట్‌ను వదిలేసి చాలా కాలమే అయ్యింది.. ఇప్పుడు నిషేధం ఏమిటా అనుకుంటున్నారా.. ఇది క్రికెట్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నిషేధం కాదు. మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేయడంతో అతని డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు నిషేధించారు. షేన్ వార్న్ ఆరోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా అతను ఏడాది పాటు కారు నడపకుండా ఉండాలని వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జాగ్వర్ కారును అద్దెకు తీసుకున్న వార్న్.. 40 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన కెన్‌సింగ్టన్ జోన్‌లో 47 మైళ్ల వేగంతో వెళ్లడంతో అతనిపై నిషేధానికి కారణమైంది. అంతకుముందు ట్రాఫిక్ ఉల్లంఘనల్లో భాగంగా వార్న్ పేరిట 15 పాయింట్లు ఉన్నాయి. 2016 మొదలుకొని గతేడాది ఆగస్టు వరకూ వార్న్ లైసెన్స్‌పై 15 పాయింట్లు ఉండటం గమనార్హం. దాంతో మరోసారి ట్రాఫిక్ నిబంధనల్ని అతి క్రమించడంతో వార్న్‌కు శిక్ష తప్పలేదు. దాంతో పాటు రూ.1.62 లక్షల జరిమానా కూడా వార్న్‌పై పడింది.
Comments
Please login to add a commentAdd a comment