1990లలో ప్రత్యర్ధి బ్యాటర్లను తమ స్పిన్ మయాజాలంతో ఈ ఇద్దరు స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టేవారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్.. మరొకరు శ్రీలంక లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.
తాజాగా గ్రేట్ షేన్ వార్న్‌ను గుర్తుచేసుకుని ముత్తయ్య మురళీధరన్ భావోద్వేగానికి లోనయ్యాడు. వార్న్‌ను చాలా మిస్స్ అవుతున్నాము అని అతడు తెలిపాడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో వార్న్ స్పిన్ మ్యాజిక్‌ను దగ్గరి నుంచి చూసే వాడిని అని ముత్తయ్య అన్నాడు .
"వార్న్ నాకంటే చాలా గొప్పవాడు అని నేను ఎప్పుడూ భావిస్తున్నాను. నేను శ్రీలంక తరపున ఆడుతున్నప్పుడు అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడు అల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్. మేము అందరం షేన్‌ను మిస్ అవుతున్నాం" అని మురళీధరన్ పేర్కొన్నాడు కాగా భారత్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో మురళీధరన్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మణిపాల్ టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment