ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనున్న రాజస్థాన్..కారణం ఏంటో తెలుసా? | Rajasthan Royals to don special jersey against Mumbai Indians | Sakshi
Sakshi News home page

IPL 2022: ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనున్న రాజస్థాన్..కారణం ఏంటో తెలుసా?

Published Sat, Apr 30 2022 2:08 PM | Last Updated on Sat, Apr 30 2022 2:09 PM

Rajasthan Royals to don special jersey against Mumbai Indians - Sakshi

Courtesy: IPL Twitter

రాజస్థాన్ రాయల్స్ తమ మాజీ కెప్టెన్, దివంగత షేన్ వార్న్‌కు నివాళిగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. రాజస్థాన్ ఆటగాళ్ల జెర్సీ కాలర్ పైనా, 'SW23' అని ఎంబ్రాయిడరీ చేయబడి ఉంది. ఈ ప్రత్యేక జెర్సీకు సంబంధించిన ఓ వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా 2008లో వార్న్‌ నాయకత్వంలో రాజస్థాన్ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకుంది.

అదే విధంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు వార్న్‌కు నివాళులర్పించేందుకు రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. ఇక ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుతంగా రాణిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌.. 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

చదవండి: IPL 2022: "బ్యాటింగ్‌లో చెత్తగా ఆడాం.. బౌలర్లు అద్భుతంగా రాణించారు"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement