Ashes 2021 22 Aus Vs Eng: Shane Warne Ideal Australian Playing XI 1st Test: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ మొదటి రెండు టెస్టులు ఆడనున్న 15 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టును గురువారం ప్రకటించింది. కాగా డిసెంబరు 8 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ మొదటి టెస్టుకు తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్న వార్న్... మూడు, నాలుగు స్థానాల్లో మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్‌కు అవకాశం వచ్చాడు.
ఆ తర్వాతి స్థానాలకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్‌ను ఎంచుకున్నాడు. ఇదిలా ఉండగా... మహిళకు అసభ్య సందేశాలు పంపినట్లు తేలడంతో టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన టిమ్ పైన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇక అతడి స్థానంలో పాట్ కమిన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌తో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే, వార్న్ మాత్రం జోష్ ఇంగ్లిస్‌కే ఓటు వేశాడు.
మొదటి టెస్టుకు షేన్ వార్న్ ప్రకటించిన జట్టు ఇదే!
డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), జై రిచర్డ్‌సన్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలనున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే!
🔒 it in!
— Cricket Australia (@CricketAus) December 2, 2021
Alex Carey will take the gloves for the first two matches of the Vodafone Men's #Ashes Series against England. pic.twitter.com/Ui6JDEfD0f
Comments
Please login to add a commentAdd a comment