William Somerville Was 2nd Spinner After Shane Warne Without Wicket In India.. న్యూజిలాండ్ స్పిన్నర్ విలియమ్ సోమర్‌విల్లే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక విదేశీ స్పిన్నర్(రెండు ఇన్నింగ్స్‌లు) అత్యధిక ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇది రెండోసారి. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సోమర్ విల్లే తొలి ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లు వేసి 60 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేదు.. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లు వేసిన అతను 38 పరుగులిచ్చి వికెట్ తీయలేదు.
చదవండి: IND Vs NZ: ఆరంగేట్ర మ్యాచ్‌లో మరో రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్..
ఓవరాల్‌గా 40 ఓవర్లు వేసి 98 పరుగులిచ్చిన సోమర్విల్లే ఒక్క వికెట్ తీయలేక చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంతకముందు 1997-98లో టీమిండియా పర్యటనలో ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 47 ఓవర్ల వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాదాపు 21 ఏళ్ల తర్వాత కివీస్ స్పిన్నర్ సోమర్‌విల్లే దీనిని రిపీట్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. 2 పరుగులు చేసిన యంగ్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆట ఐదోరోజులో న్యూజిలాండ్ గెలవాలంటే 280 పరుగులు అవసరం కాగా.. టీమిండియా 9 వికెట్లు కావాలి.
చదవండి: Cheteshwar Pujara: మాట నిలబెట్టుకోలేదు.. అజిత్ వాడేకర్ చెత్త రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment