నార్త్‌సౌండ్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధించడాన్ని ఆసీస్ స్పిన్ దిగ్జజం షేన్ వార్న్ తీవ్రంగా తప్పుబట్టాడు. అసలు హోల్డర్‌పై నిషేధం విధించే ముందు ఐసీసీ కనీసం కామన్‌సెన్స్ లేకండా వ్యవహరించిందంటూ మండిపడ్డాడు. ఈ విషయంలో ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేయాల్సిందిగా హోల్డర్‌కు సూచించాడు. ‘ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మూడు రోజులు మించి జరగలేదు. అటువంటప్పుడు స్లో ఓవర్‌రేట్ అంటూ హోల్డర్‌పై మ్యాచ్ నిషేధం విధించడం నిజంగానే చెత్త నిర్ణయం. ఇక్కడ ఐసీసీ కనీసం ఇంగితం కూడా లేకుండా వ్యవహరించింది. హోల్డర్.. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లు’ అని వార్న్ పేర్కొన్నాడు.
అదే సమయంలో ఇంగ్లండ్‌పై 10 వికెట్లతో రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను ఇంకో మ్యాచ్ ఉండగానే కైవసం చేసకున్న విండీస్‌ను వార్న్ అభినందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ ఎంత బలమైనదో మరోసారి నిరూపించిందన్న వార్న్... ఇదే విజయ పరంపరను భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నాడు.
ఇక్కడ చదవండి: వెస్టిండీస్ ఎన‍్నాళ్లకెన్నాళ్లకు..
Comments
Please login to add a commentAdd a comment