
ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ శుక్రవారం హాఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అదే విధంగా మరో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్ కూడా శుక్రవారం మృతి చెందారు. ఈ క్రమంలో భారత్-శ్రీలంక తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు ఆటగాళ్ల మృతి పట్ల ఇరు జట్ల ఆటగాళ్లు సంతాపం పాటించారు. షేన్‌వార్న్,రాడ్ మార్ష్ మృతికి సంతాపంగా ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అలాగే ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాడ్జ్‌లను ధరించి బరిలోకి దిగారు.
“శుక్రవారం మృతి చెందిన రాడ్ మార్ష్ షేన్ వార్న్‌ల కోసం మొదటి టెస్టు 2వ రోజు ఆట ప్రారంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించారు. భారత క్రికెట్ జట్టు కూడా ఈరోజు నల్ల బ్యాండ్లు ధరించనుంది' అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. ఇక రెండో రోజు ఆటను టీమిండియా దూకుడుగా ఆరంభించింది. రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగగా, అశ్విన్ ఆర్ధ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు లంచ్ విరామానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(102), జయాంత్ యాదవ్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: IND vs SL 1st Test: ఏంటి రోహిత్.. డుప్లెసిస్ బ్యాటింగ్‌ను కాపీ కొడుతున్నావా..?
A minute’s silence was observed before the start of play on Day 2 of the first Test for Rodney Marsh and Shane Warne who passed away yesterday. The Indian Cricket Team will also be wearing black armbands today.@Paytm #INDvSL pic.twitter.com/VnUzuqwArC
— BCCI (@BCCI) March 5, 2022