IPL 2022 Qualifier 2: RCB Shares Emotional Tweet About Shane Warne For RR, Wins Hearts - Sakshi
Sakshi News home page

RCB Tweet On RR: రాజస్తాన్‌కు ఆర్సీబీ విషెస్‌.. గుండెల్ని మెలిపెట్టే ట్వీట్‌! హృదయాలు గెలిచారు!

Published Sat, May 28 2022 4:44 PM

IPL 2022: RCB Win Hearts With Emotional Tweet For Rajasthan Royals - Sakshi

IPL 2022 RR Vs RCB: ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రయాణం శుక్రవారంతో ముగిసింది. కీలకమైన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. ఫైనల్‌ చేరి ట్రోఫీ గెలుస్తుందంటూ ఆశగా ఎదురుచూసిన లక్షలాది మంది అభిమానుల హృదయాలు ముక్కలు చేసింది. 

కాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయంతో లక్కీగా ప్లే ఆఫ్స్‌ చేరిన ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందం.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించి క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించింది.

కానీ, అహ్మదాబాద్‌ వేదికగా సాగిన కీలక పోరులో మాత్రం రాజస్తాన్‌ ముందు తలవంచకతప్పలేదు. అయితే, ఓటమి బాధలో కూరుకుపోయినా ఆర్సీబీ క్రీడాస్ఫూర్తి మరువలేదు. ఆస్ట్రేలియా లెజెండ్‌, తొలి సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన షేన్‌ వార్న్‌ను గుర్తుచేస్తూ రాజస్తాన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది.

ఈ మేరకు.. ‘‘ది గ్రేట్‌ షేన్‌ వార్న్‌ మిమ్మల్ని చూసి చిరునవ్వులు చిందిస్త ఉంటారు. మీరు చాలా బాగా ఆడారు. ఫైనల్‌కు గుడ్‌లక్‌’’ అంటూ ఆర్సీబీ ట్వీట్‌ చేసింది. ఇందుకు స్పందించిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఇరు జట్ల జెర్సీ రంగులను ప్రతిబింబించేలా రెండు హార్ట్‌ ఎమోజీలతో ప్రేమను కురిపించింది. ఈ ట్వీట్లు క్రికెట్‌ ప్రేమికుల మనసు గెలుచుకుంటున్నాయి.

ఐపీఎల్ క్వాలిఫైయర్‌-2: రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజర్స్‌
టాస్‌: రాజస్తాన్‌ రాయల్స్‌
బెంగళూరు స్కోరు: 157/8 (20)
రాజస్తాన్‌ స్కోరు: 161/3 (18.1)
విజేత: ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయం.. ఫైనల్లో అడుగు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జోస్‌ బట్లర్‌(60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులు- నాటౌట్‌)

చదవండి 👇
Sachin Tendulkar On RR Bowlers: వాళ్లిద్దరు అద్భుతం చేశారు.. ఆర్సీబీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు: సచిన్‌ ప్రశంసలు
IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్‌.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు'

Advertisement
 
Advertisement
 
Advertisement