IPL 2022: Harbhajan Singh Makes Big Prediction on Title Winner Not GT Why - Sakshi
Sakshi News home page

IPL 2022 Title Winner Prediction: క్వాలిఫైయర్‌-2లో గెలుపు వారిదే.. టైటిల్‌ కొట్టేదీ వాళ్లే: హర్భజన్‌ సింగ్‌

Published Fri, May 27 2022 2:00 PM | Last Updated on Fri, May 27 2022 4:01 PM

IPL 2022: Harbhajan Singh Makes Big Prediction on Title Winner Not GT Why - Sakshi

రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌, ఆర్సీబీ సారథి డుప్లెసిస్‌(PC: IPL)- హర్భజన్‌ సింగ్‌(Twitter)

IPL 2022: ఐపీఎల్‌-2022 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం(మే 27) క్వాలిఫైయర్‌-2 జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 29న గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగనున్న టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ విజేత ఎవరో అంచనా వేశాడు.

ఈసారి ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందుకుంటుందని పేర్కొన్నాడు. ఈ మేరకు భజ్జీ మాట్లాడుతూ.. ‘‘బెంగళూరు జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. జట్టుకు ట్రోఫీ అందించగల సత్తా గల ప్లేయర్లు ఉన్నారు.

రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ కచ్చితంగా గెలుస్తుందని నా మనసు చెబుతోంది. అదే జరిగితే ఫైనల్లో కూడా గెలిచి వారు ఈసారి కప్‌ అందుకోవడం ఖాయం’’ అని స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. సమిష్టి కృషితో పోరాడితే ఈసారి ఆర్సీబీ టైటిల్‌ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు. బెంగళూరు బలమైన ప్రత్యర్థి అని వారిని ఆపడం అంత తేలికేమీ కాదని పరోక్షంగా రాజస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.

కాగా లీగ్‌ దశలో ముంబై ఇండియన్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందం.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించి క్వాలిఫైయర్‌-2కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌తో పోటీ పడనుంది.

ఇక ఇందులో గెలిచి.. ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఆర్సీబీ టైటిల్‌ను ముద్దాడాలంటూ బెంగళూరు ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు. ‘‘ఈసారి కప్పు మాదే’’ అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే, వారి ఆశ నెరవేరాలంటే ఆర్సీబీ ఇంకా రెండు విజయాలు సాధించాలి మరి!

చదవండి 👇
Qualifier 2 RR Vs RCB: సమఉజ్జీలు.. పంతం నీదా- నాదా సై.. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిస్తే!
Shikhar Dhawan: పాపం ధావన్‌... తన తప్పు లేకున్నా తన్నులు తిన్నాడు! వైరల్‌ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement