Shane Warne Top-5 Test Batsmen List.. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తన టాప్-5 టెస్టు బ్యాట్స్‌మన్ జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లిని పరిమిత ఓవర్ల నుంచి బీసీసీఐ కెప్టెన్‌గా తొలగించింది. వన్డేలు, టి20ల్లో రోహిత్ కెప్టెన్ కాగా.. కోహ్లి ఇకపై టెస్టుల్లో మాత్రమే కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక బ్యాట్స్‌మన్‌గానూ కోహ్లి అంతగా రాణించడం లేదు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు రెండేళ్లవుతుంది.
చదవండి: IND Vs SA: సౌతాఫ్రికాతో సిరీస్.. కోహ్లి కీలక నిర్ణయం!
ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ను ఎన్నుకున్నాడు. తన దృష్టిలో టెస్టు ఫార్మాట్‌లో స్మిత్ మోస్ట్ ఔట్‌స్టాండింగ్ బ్యాట్స్‌మన్.. అందుకే స్మిత్‌కు నెంబర్‌వన్ స్థానం ఇచ్చా. అంటూ తెలిపాడు. ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో 11 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న జో రూట్‌ను రెండోస్థానం ఇచ్చాడు. ఇక మూడో స్థానాన్ని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ఇచ్చాడు. ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ను కివీస్ గెలవడంలో కేన్‌మామ కీలకపాత్ర పోషించాడు.
టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్‌లో 49.. రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు సాధించాడు. చివరగా ఐదో స్థానంలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్‌కు చోటు కల్పించాడు. అతి తక్కువ కాలంలోనే టెస్టుల్లో నాణ్యమైన బ్యాట్స్‌మన్‌గా పేరుపొందిన లబుషేన్ ఆసీస్ తరపున 19 టెస్టులు ఆడాడు. ఈ 19 టెస్టుల్లో అతని పేరిట 5 సెంచరీలు.. 11 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐసీసీ ఇటీవలే ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రూట్, స్మిత్, విలియమ్సన్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా.. లబుషేన్ నాలుగో స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ ఐదు.. కోహ్లి ఆరో స్థానంలో ఉన్నారు.
చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి!
Comments
Please login to add a commentAdd a comment