
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అరంగేట్ర ఆటగాడు, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 76 (161బంతులు 8ఫోర్లు 1సిక్స్) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మయాంక్ వికెట్ అనంతరం అంపైర్లు టీబ్రేక్ ఇవ్వడంతో ఆ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 33(102 బంతులు, 2 ఫోర్లు) ఉన్నాడు. మయాంక్ అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment