మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్ధశతకంతో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన అగర్వాల్.. 95 బంతుల్లో ఆరు ఫోర్లతో కెరీర్‌లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. తద్వార అరంగేట్ర టెస్టుల్లో అర్థసెంచరీ నమోదు చేసిన ఏడో భారత ఓపెనర్‌గా మయాంక్ గుర్తింపు పొందాడు. మయాంక్ కన్నా ముందు ధావన్, పృథ్వీషా, గవాస్కర్, ఇబ్రహిం, అరుణ్, హుస్సెన్‌లు ఈ ఘనతను సాధించారు. పెర్త్ టెస్ట్ పరాజయంతో జట్టులో సమూల మార్పులు చేసిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఉన్నపళంగా ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ను రప్పించి తుది జట్టులో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఈ అవకాశాన్ని మయాంక్ చక్కగా సద్వినియోగం చేసుకుని తనపై టీమ్ మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అంతకముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళి విజయ్‌లపై వేటు వేసిన టీమ్ మేనేజ్‌మెంట్.. ప్రయోగాత్మకంగా హనుమ విహరీ-మయాంక్‌లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. విహారీ(8) విఫలమైనప్పటికీ.. మయాంక్, పుజారాలు నిలకడగా ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment