ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా బుధవారం నుంచి జరిగే మూడో టెస్ట్‌కు బీసీసీఐ భారత తుది జట్టును ప్రకటించింది. దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళి విజయ్‌లపై వేటు వేసింది. ఇద్దరిని బెంచ్‌కే పరిమితం చేసింది. యువ ఆటగాడు పృథ్వీషా గాయంతో సిరీస్ నుంచి దూరం కావడంతో ఉన్నపళంగా రప్పించిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది. వెన్ను నొప్పితో రెండు టెస్ట్‌కు దూరమైన రోహిత్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు.