మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్రమంలో బంతి రోహిత్ ఎడమ మోకాలికి బలంగా తాకినట్లు తెలుస్తోంది.
దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వెంటనే అతడికి ఫిజియో ఐస్ ప్యాక్‌ను తెచ్చి మోకాలి మర్ధన చేశాడు. ఆ తర్వాత రోహిత్ తన ప్రాక్టీస్‌ను కొనసాగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అతడి గాయంపై బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మ్యాచ్ ఆరంభానికి ముందు హిట్‌మ్యాన్ గాయంపై జట్టు మెనెజ్‌మెంట్ ఓ అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతడు దూరమైతే సర్ఫరాజ్ ఖాన్ లేదా ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్ మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఇక ఇది ఇలా ఉండగా.. రోహిత్ కంటే ముందు నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్ సైతం గాయపడ్డాడు. అతడి కుడి చేతి మణికట్టుకు బంతి తాకింది. అయితే అతడి గాయం తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. డిసెంబర్ 26 నుంచి ఈ బ్యాక్సింగ్ డే టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment