
మెల్‌బోర్న్: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రికార్డులపై రికార్డు కొల్లగొడుతూ దూసుకుపోతున్న క్రికెటర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకుని క్రికెట్‌లో అతనే ఒక పెద్ద సూపర్‌స్టార్ అనేంతగా కితాబులు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఫీట్‌ను కోహ్లి నెలకొల్పాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. 2018 అంతర‍్జాతీయ క్రికెట్‌లో కోహ్లి 2,653 పరుగులతో ఎవ్వరికీ అందనంత ఎత‍్తులో నిలిచాడు. సుమారు 70 సగటుతో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 160.
ఫలితంగా వరుసగా మూడో ఏడాది కూడా అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. 2016లో 2,595 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. 2017లో 2,818 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించిన కోహ్లి ‘హ్యాట్రిక్’ పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో భారత్ విజయం సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. దాంతో విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇది కోహ్లికి 11వ విదేశీ టెస్టు విజయం.
Comments
Please login to add a commentAdd a comment