IND vs AUS 4th Test Live Updates and highlights:
ముగిసిన తొలి రోజు ఆట..
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
క్రీజులో స్టీవ్ స్మిత్(68 బ్యాటింగ్), కమ్మిన్స్(8) ఉన్నారు. తొలి రెండు సెషన్స్‌లో ఆస్ట్రేలియా అధిపత్యం చెలాయించగా.. ఆఖరి సెషన్‌లో భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. విధ్వంసకర ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.
భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. ఆకాష్ దీప్, సుందర్, జడేజా తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో కాన్‌స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72), స్మిత్(68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆరో వికెట్ డౌన్..
అలెక్స్ క్యారీ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 84 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 303/6. క్రీజులో కమ్మిన్స్(1), స్మిత్(1) పరుగులతో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న స్మిత్, క్యారీ..
ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్(65 నాటౌట్), అలెక్స్ క్యారీ(21 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. 77 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ..
ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరో టెస్టు హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్ 50 పరుగులతో తనం బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 251/5. క్రీజులో స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ ఉన్నాడు.
ఆసీస్ ఐదో వికెట్ డౌన్..
మిచెల్ మార్ష్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మార్ష్.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 71 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 251/5
బమ్రా సూపర్ బాల్.. హెడ్ క్లీన్ బౌల్డ్
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో ట్రావిస్ హెడ్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్రా దెబ్బకు హెడ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 67 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 241/4
ఆసీస్ మూడో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్
ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన లబుషేన్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు. 66 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 237/3
టీ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?
టీ విరామానికి 53 ఓవర్లలో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(44), స్టీవ్ స్మిత్(10) పరుగులతో ఉన్నారు.
ఆసీస్ రెండో వికెట్ డౌన్..
ఉస్మాన్ ఖావాజా రూపంలో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన ఉస్మాన్ ఖావాజా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు. 45 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 154/2
43 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 154/1
43 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(33), ఉస్మాన్ ఖావాజా(57) ఉన్నారు.
37 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 137/1
37 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(22), ఉస్మాన్ ఖావాజా(51) ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లు..
లంచ్ విరామం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. 29 ఓవర్ల ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(38), మార్నస్ లబుషేన్(12) పరుగులతో ఉన్నారు.
లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోర్: 112/1
ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(38 బ్యాటింగ్), లబుషేన్(12 బ్యాటింగ్) ఉన్నారు.
ఆసీస్ తొలి వికెట్ డౌన్..
కొంటాస్ రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన కొంటాస్ రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు. 25 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/1.
సామ్ కొంటాస్ హాఫ్ సెంచరీ..
ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొంటాస్ తన అరంగేట్రంలో అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే కొంటాస్ తన తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఆసీస్ తరపున టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్నవయష్కుడిగా కొంటాస్ నిలిచాడు. 19 ఏళ్ల 85 రోజుల్లో కొంటాస్ ఈ ఘనత అందుకున్నాడు. 14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 77/0. క్రీజులో కొంటాస్(55), ఉస్మాన్ ఖావాజా(21) ఉన్నారు.
9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 37/0
అసీస్ అరంగేట్ర ఆటగాడు సామ్ కొంటాస్ అద్బుతంగా ఆడుతున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం ఈ యువ ఆటగాడు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. 9 ఓవర్లకు ముగిసే సరికి ఆసీస్ స్కోర్: 37/0. క్రీజులో కొంటాస్(20), ఉస్మాన్ ఖావాజా(16) ఉన్నారు.
5 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 6/0
5 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. క్రీజులో కొంటాస్(2), ఉస్మాన్ ఖావాజా(4) ఉన్నారు.
బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.
మరోవైపు ఆసీస్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచలనం సామ్ కొంటాస్ తుది జట్టులోకి రాగా.. గాయం కారణంగా దూరమైన హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
తుది జట్లు
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంటాస్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
Comments
Please login to add a commentAdd a comment