భారత్-ఆస్ట్రేలియా మధ్య ‘బాక్సింగ్ డే’ టెస్టు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా(Teamindia) అన్ని విధాల సన్నద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. 2020–21 పర్యటనలో మెల్‌బోర్న్‌లో విజయంతోనే టీమిండియా సిరీస్ గెలుపు దిశగా అడుగు వేసింది.
ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భారత్ జట్టు యోచిస్తోంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల బీజీటీ ట్రోఫీ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ బ్యాక్సింగ్ డే ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశించి పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తుందని అలీ అంచనా వేశాడు.
"మెల్‌బోర్న్ టెస్టులో భారత్ గెలుస్తుందని భావిస్తున్నాను. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. నాలుగో టెస్టులో ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే ఛాన్స్‌లు సన్నగిల్లుతాయని ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.
ఆ తర్వాత శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ సిరీస్ శ్రీలంకలో జరగనుంది. ఉపఖండ పిచ్‌లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. ఇవన్నీ ఆసీస్ దృష్టిలో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ ఒత్తిడిలో ఆస్ట్రేలియా తప్పులు చేసే అవకాశముంది. దీన్ని భారత్ సొమ్ము చేసుకోవాలి.
అయితే బ్రిస్బేన్, అడిలైడ్‌లో బ్యాటర్లు చేసిన తప్పిదాలు మెల్‌బోర్న్‌లో కూడా రిపీట్ చేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అలీ పేర్కొన్నాడు. కాగా ఈ బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఆడనున్నట్లు సమాచారం.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్?
Comments
Please login to add a commentAdd a comment