
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో 443/7 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్.. ఆతిథ్య జట్టును 151 పరుగులకే కుప్పకూల్చింది. తద్వార 292 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా..భారత్ అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి చేతులు కాల్చుకుంది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్‌పై ఆశలు రేకిత్తించింది.
హనుమ విహారి(13) వికెట్ అనంతరం వరుసగా.. పుజారా (0), కోహ్లి (0), రహానే(1), రోహిత్ (5)ల వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన పుజారా, హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లిలు డకౌట్ కావడం గమనార్హం. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ (28), రిషభ్ పంత్ (6)లున్నారు. మూడో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు పడటం చూస్తే పిచ్ బౌలింగ్‌కు ఎంత అనుకూలించిందో స్పష్టంగా అర్థం అవుతోంది. అయినా కోహ్లి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం తప్పిదమేనని, ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడనిస్తే ఒత్తిడిలో త్వరగా వికెట్లు కోల్పోయేవారని, అప్పుడు భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పోయిందేమి లేదని, కానీ ఆసీస్ ఆటగాళ్లకు పోరాడే శక్తినిచ్చినట్లైందని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment