PAK vs AUS: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. | Big blow for Pakistan! Pacer ruled out of PAK vs AUS Boxing Day Test | Sakshi
Sakshi News home page

PAK vs AUS: పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌..

Published Thu, Dec 21 2023 9:27 AM | Last Updated on Thu, Dec 21 2023 9:42 AM

Big blow for Pakistan, Pacer ruled out of PAK vs AUS Boxing Day Test - Sakshi

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు ముందు పాకిస్తాన్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. పాక్‌ యువ పేసర్‌ ఖుర్రం షాజాద్‌ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పెర్త్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన షాజాద్‌.. మోకాలి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం అతడిని స్కానింగ్‌ తరలించగా గాయం తీవ్రమైనదిగా తేలింది.

ఈ క్రమంలోనే అతడిని  పాకిస్తాన్‌ మేనెజ్‌మెంట్‌ తప్పించింది. కాగా తన అరంగేట్ర మ్యాచ్‌లో ఈ యువ పేసర్‌ అకట్టుకున్నాడు. మొదటి టెస్టులో 5 వికెట్లు పడగొట్టి షాజాద్‌ సత్తాచాటాడు. ఇక అతడి స్ధానంలో  సీనియర్‌ పేసర్‌ హసన్‌ అలీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో పాక్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement