
మెల్‌బోర్న్ : భారత్‌తో జరుగుతున్నమూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 151 పరుగులకే ముగిసింది. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దాటికి ఆతిథ్య బ్యాట్స్‌మెన్ పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో భారత్‌కు 292 పరుగుల ఆధిక్యం లభించింది. 8/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది.
ఫించ్ ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్‌కు శుభారంభాన్ని అందించగా.. బుమ్రా హ్యారిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (21), షాన్ మార్ష్ (19), ట్రావిస్ హెడ్(20), మిచెల్ మార్ష్ (9), టిమ్ పెయిన్ (22), కమిన్స్ (17), నాథన్ లయన్(0), హజల్‌వుడ్ (0)లు భారత బౌలర్ల దాటికి ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బుమ్రా 6 వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, షమీ, ఇషాంత్‌లు ఒక వికెట్ తీశారు. ఆసీస్‌ను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడటానికే మొగ్గు చూపింది.