
8/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్
మెల్‌బోర్న్ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 8/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే ఓపెనర్లు ఆరోన్ ఫించ్(8), హ్యారిస్(22) వికెట్లను కోల్పోయింది. ఫించ్‌ను ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్‌కు శుభారంభాన్ని అందించగా.. బుమ్రా హ్యారిస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖాజా (21), షాన్ మార్ష్ (19), ట్రావిస్ హెడ్(20), మిచెల్ మార్ష్ (9)లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో టీమ్ పెయిన్ (2), ప్యాట్‌కమిన్స్(0) లున్నారు. 243 లోపు ఆతిథ్య జట్టు ప్యాకప్ అయితే ఫాలోఆన్ ప్రమాదంలో పడుతోంది. ఇక భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/7 డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే.