మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా బుధవారం నుంచి జరిగే మూడో టెస్ట్‌కు బీసీసీఐ భారత తుది జట్టును ప్రకటించింది. దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళి విజయ్‌లపై వేటు వేసింది. ఇద్దరిని బెంచ్‌కే పరిమితం చేసింది. యువ ఆటగాడు పృథ్వీషా గాయంతో సిరీస్ నుంచి దూరం కావడంతో ఉన్నపళంగా రప్పించిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది. వెన్ను నొప్పితో రెండు టెస్ట్‌కు దూరమైన రోహిత్ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు.
దీంతో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్-రోహిత్ శర్మ వస్తారా? లేక మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలతో ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ప్రయోగం చేస్తారా? అనేది చూడాలి? ఈ మ్యాచ్‌తో మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక పేసర్ ఉమేశ్ యాదవ్‌కు కూడా ఉద్వాసన పలికిన జట్టు మేనేజ్‌మెంట్.. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే చెరొకటి గెలిచిన ఇరు జట్లు మూడో టెస్ట్ విజయంపై దృష్టిసారించాయి. ఎలాగైన విజయం సాధించి సిరీస్‌లో పై చేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
భారత తుది జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చతేశ్వర పుజారా, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
India name Playing XI for 3rd Test: Virat Kohli (C), Ajinkya Rahane (VC), Mayank Agarwal, Hanuma Vihari, Cheteshwar Pujara, Rohit Sharma, Rishabh Pant (WK), Ravindra Jadeja, Mohammed Shami, Ishant Sharma, Jasprit Bumrah #TeamIndia #AUSvIND pic.twitter.com/DImj8BVTj5
— BCCI (@BCCI) 24 December 2018
Comments
Please login to add a commentAdd a comment