Durban test
-
ఆసీస్ విజయం నేడే ఖాయం
డర్బన్: తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు ఖాయమైంది. కాకపోతే... ప్రత్యర్థి చివరి వికెట్ పడగొట్టలేక ఆ జట్టు ఐదో రోజు కూడా మైదానంలోకి దిగాల్సి వస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 213/9తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 227కు ఆలౌటైంది. అనంతరం 417 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 293 పరుగులు చేసింది. చేతిలో ఒక వికెట్ మిగిలి ఉండగా... విజయానికి మరో 124 పరుగులు దూరంలో నిలిచింది. ప్రధాన బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (9), ఆమ్లా (8), డివిలియర్స్ (0), కెప్టెన్ డుప్లెసిస్ (4)ల వైఫల్యం కారణంగా ఒక దశలో దక్షిణాఫ్రికా 4/49 స్కోరుతో దయనీయస్థితిలో నిలిచింది. ఈ దశలో ఓపెనర్ మార్క్రమ్ (143; 19 ఫోర్లు) పోరాట పటిమ చూపాడు. అద్భుత శతకం సాధించిన అతడు తొలుత డిబ్రుయెన్ (36)తో కలిసి 87 పరుగులు, కీపర్ డికాక్ (81 బ్యాటింగ్; 11 ఫోర్లు) అండగా ఆరో వికెట్‌కు 147 పరుగులు జోడించి జట్టు పరువు నిలిపాడు. వీరిని విడగొట్టేందుకు ఆసీస్ బౌలర్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మిచెల్ మార్‡్ష బౌలింగ్‌లో ఎట్టకేలకు మార్క్రమ్ అవుటయ్యాడు. తర్వాత స్టార్క్ (4/74) విజృంభించి ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. వెలుతురు తగ్గడంతో చివరి ఓవర్లను స్మిత్, లయన్ వేయాల్సి వచ్చింది. డికాక్, మోర్కెల్ (27 బంతుల్లో 0 బ్యాటింగ్) వికెట్ ఇవ్వకుండా 9 ఓవర్లు పైగా బ్యాటింగ్ చేశారు. -
భారత్ 68/2: డ్రా దిశగా రెండో టెస్టు
దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. చివరి రోజు ఆటలో అద్భుతం జరిగితే తప్ప ఫలితం వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం చటేశ్వరా పూజారా(32), కోహ్లి(11) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 299/5 ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు 500 పరుగులకు ఆలౌటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగుల ఆధిక్యం సాధించారు. వీడ్కోలు టెస్టు ఆడుతున్న జాక్వెస్ కలిస్ టెస్టు కెరీర్లో 45వ సెంచరీ నమోదు చేశాడు. భారత్‌తో రెండో టెస్టులో దిగ్గజ ఆల్‌రౌండర్ కలిస్ (115) సెంచరీతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కలిస్, స్టెయిన్ బాధ్యాతాయుత బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాకు ఆధిక్యం అందించారు. కాగా తొలి సెషన్ చివర్లో వీరిద్దరూ అవుటయ్యారు. కలిస్‌ను జడేజా, స్టెయిన్ (44)ను జహీర్ పెవిలియన్ చేర్చారు. అనంతరం రాబిన్ పీటర్సన్ (52 బంతుల్లో 61) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా, డుప్లెసిస్ (43) రాణించాడు. వీరిద్దరూ స్కోరును 500 మార్క్‌కు చేర్చారు. ఈ జోడీతో పాటు మోర్కెల్ వెంటవెంటనే అవుటవడంతో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా ఆరు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కడపటి సమాచారం అందేసరికి వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
సెంచరీకి చేరువలో విజయ్
డర్బన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య గురువారమిక్కడ ప్రారంభమైన రెండో టెస్టుకు అంతరాయం కలిగింది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట నిలిచిపోయింది. లైట్లను సరి చేసేందుకు మైదాన సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆట ఆగిపోయే సమయానికి భారత్ 181/1 స్కోరుతో బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమింయా 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్(29) మరోసారి విఫలమయ్యాడు. మురళీ విజయ్, పూజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అర్థ సెంచరీలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. విజయ్ 91, పూజారా 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. విజయ్ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఉన్నాడు. సెంచరీ పూర్తి చేస్తే టెస్టుల్లో అతడికిది నాలుగోది అవుతుంది.