ఆటో పైలెట్‌ని నమ్ముకుంది.. ఇప్పుడు కష్టాలపాలయ్యింది ? | Tesla Auto Pilot Mode Again Surfed in News With an Accident Occurred in Australia | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి టెస్లా ఆటో పైలెట్‌.. కొనసాగుతున్న విచారణ

Published Thu, Mar 24 2022 4:46 PM | Last Updated on Thu, Mar 24 2022 9:09 PM

Tesla Auto Pilot Mode Again Surfed in News With an Accident Occurred in Australia - Sakshi

టెస్లా ఆటోపైలెట్‌ ఫీచర్‌ మరోసారి వార్తల్లోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసును మెల్‌బోర్న్‌ కోర్టు విచారిస్తుండగా నిందితురాలు ఆటో పైలెట్‌ అంశాన్ని ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దృష్టిని ఆకర్షించింది. 
 
భారత సంతతి యువతి సాక్షి అగర్వాల్‌ ఇటీవల ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైంది. టెస్లాకి చెందిన మోడల్‌ 3 కారులో ప్రయాణిస్తున్న సాక్షి అగర్వాల్‌ రోడ్డుపై ట్రామ్‌ ఎక్కేందుకు ప్రయత్నిస్తోన్న నికోల్‌ లాగోస్‌ అనే మహిళను కారుతో ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన కేసు మెల్‌బోర్న్‌ కోర్టులు విచారణకు వచ్చింది.

కోర్టు విచారణలో నిందితురాలు సాక్షి అగర్వాల్‌ మాట్లాడుతూ.. ట్రామ్‌ మరింత ముందుకు వెళ్లి ఆగుతుందని తాను భావించానని అందువలేల్ల కారును సకాలంలో అదుపు చేయలేకపోయానంటూ ఆమె తెలిపారు. పైగా  ప్రమాదం జరిగినప్పుడు కారు ఆటో పైలెట్‌ మోడ్‌లో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు తుది తీర్పును వెల్లడించలేదు. కేసు విచారణ దశలోనే ఉంది.

A 23-year-old driver is accused of hitting an aged care worker in Melbourne - claiming her Tesla was on autopilot at the time.

Police say the P-plater left the scene and returned hours later to speak to officers. @penelopeliersch #9News pic.twitter.com/U0xEqAPUkk

డ్రైవర్‌ సాయం లేకుండా కారు నడిపే టెక్నాలజీని టెస్లా కార్లలో అందుబాటులోకి తెస్తామంటూ ఎలన్‌ మస్క్‌ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో కాకపోయినా డ్రైవర్‌ నామమాత్రపు కంట్రోల్‌లో ఉండే ఆటోపైలెట్‌ ఆప్షన్‌ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే అమెరికాలో ఈ ఆటోపైలెట్‌ మోడ్‌పై అభ్యంతరాలు ఉన్నాయి. ఇంతలో ఆస్ట్రేలియాలో మరో కేసు వెలుగు చూసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement