ఆ జట్టే టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ ఫేవరేట్‌: సునీల్‌ గావస్కర్‌ | Sunil Gavaskar picks his favourite team to lift famous trophy in Dubai | Sakshi
Sakshi News home page

ఆ జట్టే టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ ఫేవరేట్‌: సునీల్‌ గావస్కర్‌

Published Sun, Nov 14 2021 11:34 AM | Last Updated on Sun, Nov 14 2021 4:22 PM

Sunil Gavaskar picks his favourite team to lift famous trophy in Dubai - Sakshi

Sunil Gavaskar picks his favourite team to lift famous trophy: టీ20 ప్రపంచకప్‌2021లో తుది పోరుకు సమయం అసన్నమైంది. టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరో అనేది మరి కొద్ది గంట్లో తేలిపోనుంది. ఆదివారం(నవంబర్‌14) దుబాయ్‌ వేదికగా జరగనున్న ఈ తుది సమరంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే విజేత ఎవరన్నది భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అంచనా వేశాడు. ఐసీసీ ఈవెంట్‌ల నాకౌట్ రౌండ్‌లలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉన్న నేపథ్యంలో ఆ జట్టే టైటిల్‌ ఫేవరేట్‌ అని  అభిప్రాయపడ్డాడు.

"ఐసీసీ ఈవెంట్‌ నాకౌట్ దశలో ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. వాళ్లకు ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ జట్టు కీలక మ్యాచ్‌ల్లో ఓడిన సందర్బాలు కంటే గెలిచిన సందర్బాలే ఎక్కువ. వాళ్లు తమదైన రోజున ప్రత్యర్ధి జట్టును చిత్తుగా ఓడించగలరు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలి సారి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫిని ఆస్ట్రేలియన్లు కైవసం చేసుకుంటారు" అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

చదవండి: T20 World Cup 2021: టైటిల్‌ రేసులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement