
చండీగఢ్: మీడియా స్టడీస్, హెల్త్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పరస్పర సహకారం అందించుకోవడానికి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్‌బెర్రాతో చండీగఢ్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. యూనివర్సిటీ ఆఫ్ కాన్‌బెర్రా వైస్ చాన్స్‌లర్ ప్రొ.దీప్ సైని ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
కార్యక్రమంలో చండీగఢ్ వర్సిటీ చాన్స్‌లర్ డా. సత్నాం సింగ్, వైస్ చాన్స్‌లర్ డా.ఆర్.ఎస్.బవా తదితరులు పాల్గొన్నారు. నేర్చుకోవడానికి అనుకూల వాతావరణం, చవకైన విద్య, మెరుగైన ఉద్యోగావకాశాల వల్ల భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని ప్రొ. దీప్ సైని అన్నారు. ప్రపంచలో టాప్ 100 వర్ధమాన వర్సిటీల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ కాన్‌బెర్రాతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని సత్నాం సింగ్ అన్నారు.