నార్త్‌సౌండ్ (అంటిగ్వా): మహిళల టి20 ప్రపంచ కప్‌ను మళ్లీ ఆస్ట్రేలియా జట్టే శాసించింది. నాలుగో సారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ అమ్మాయిల జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డానియెల్ వ్యాట్ (37 బంతుల్లో 43; 5ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హీతర్ నైట్ (25) మెరుగనిపించింది. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ (3/22), మెగన్ షుట్ (2/13), జార్జియా వేర్‌హమ్ (2/11) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు.
తర్వాత 106 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మహిళల జట్టు 15.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మెగన్ లానింగ్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), గార్డ్‌నర్ (26 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. ఓపెనర్ అలీసా హీలీ 22 పరుగులు చేసింది. ఎకెల్‌స్టోన్, హాజెల్ చెరో వికెట్ తీశారు. గార్డ్‌నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఆరు ప్రపంచకప్‌లు జరుగగా... నాలుగుసార్లు ఆసీస్ (2010, 2012, 2014, 2018) జట్టే గెలవడం విశేషం. ఇప్పటికే ఆరు వన్డే ప్రపంచకప్‌లు సాధించడంతో ఆసీస్ నెగ్గిన మొత్తం వరల్డ్ కప్‌ల సంఖ్య పదికి చేరింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: వ్యాట్ (సి) లానింగ్ (బి) గార్డ్‌నర్ 43; బీమాంట్ (సి) విలాని (బి) షుట్ 4; జోన్స్ రనౌట్ 4; సీవర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పెర్రీ 1; నైట్ (సి) వేర్‌హమ్ (బి) గార్డ్‌నర్ 25; విన్‌ఫీల్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్‌హమ్ 6; డన్‌క్లే (బి) వేర్‌హమ్ 0; ష్రబ్‌సోల్ (సి) పెర్రీ (బి) గార్డ్‌నర్ 5; హాజెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షుట్ 6; ఎకెల్‌స్టోన్ (రనౌట్) 4; గోర్డాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 105.
వికెట్ల పతనం: 1–18, 2–30, 3–41, 4–64, 5–74, 6–74, 7–84, 8–98, 9–104, 10–105.
బౌలింగ్: మొలినెక్స్ 3–0–23–0, షుట్ 3.4–0–13–2, ఎలిస్ పెర్రీ 3–0–23–1, కిమిన్స్ 3–0–10–0, వేర్‌హమ్ 3–0–11–2, గార్డ్‌నర్ 4–0–22–3.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (బి) ఎకెల్‌స్టోన్ 22; మూనీ (సి) జోన్స్ (బి) హాజెల్ 14; గార్డ్‌నర్ (నాటౌట్) 33; లానింగ్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.1 ఓవర్లలో 2 వికెట్లకు) 106.
వికెట్ల పతనం: 1–29, 2–44.
బౌలింగ్: సీవర్ 1.1–0–3–0, ష్రబ్‌సోల్ 3–0–30–0, ఎకెల్‌స్టోన్ 4–0–12–1, హాజెల్ 3–0–19–1, గోర్డాన్ 3–0–30–0, నైట్ 1–0–10–0.
Comments
Please login to add a commentAdd a comment