Womens World T20
-
మళ్లీ ఆసీస్ అమ్మాయిలే
నార్త్‌సౌండ్ (అంటిగ్వా): మహిళల టి20 ప్రపంచ కప్‌ను మళ్లీ ఆస్ట్రేలియా జట్టే శాసించింది. నాలుగో సారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ అమ్మాయిల జట్టు 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డానియెల్ వ్యాట్ (37 బంతుల్లో 43; 5ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, హీతర్ నైట్ (25) మెరుగనిపించింది. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (3/22), మెగన్ షుట్ (2/13), జార్జియా వేర్హమ్ (2/11) ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. తర్వాత 106 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మహిళల జట్టు 15.1 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మెగన్ లానింగ్ (30 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), గార్డ్నర్ (26 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. ఓపెనర్ అలీసా హీలీ 22 పరుగులు చేసింది. ఎకెల్‌స్టోన్, హాజెల్ చెరో వికెట్ తీశారు. గార్డ్నర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి. ఈ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు ఆరు ప్రపంచకప్‌లు జరుగగా... నాలుగుసార్లు ఆసీస్ (2010, 2012, 2014, 2018) జట్టే గెలవడం విశేషం. ఇప్పటికే ఆరు వన్డే ప్రపంచకప్‌లు సాధించడంతో ఆసీస్ నెగ్గిన మొత్తం వరల్డ్ కప్‌ల సంఖ్య పదికి చేరింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: వ్యాట్ (సి) లానింగ్ (బి) గార్డ్నర్ 43; బీమాంట్ (సి) విలాని (బి) షుట్ 4; జోన్స్ రనౌట్ 4; సీవర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పెర్రీ 1; నైట్ (సి) వేర్హమ్ (బి) గార్డ్నర్ 25; విన్ఫీల్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వేర్హమ్ 6; డన్క్లే (బి) వేర్హమ్ 0; ష్రబ్సోల్ (సి) పెర్రీ (బి) గార్డ్నర్ 5; హాజెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షుట్ 6; ఎకెల్‌స్టోన్ (రనౌట్) 4; గోర్డాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 105. వికెట్ల పతనం: 1–18, 2–30, 3–41, 4–64, 5–74, 6–74, 7–84, 8–98, 9–104, 10–105. బౌలింగ్: మొలినెక్స్ 3–0–23–0, షుట్ 3.4–0–13–2, ఎలిస్ పెర్రీ 3–0–23–1, కిమిన్స్ 3–0–10–0, వేర్హమ్ 3–0–11–2, గార్డ్నర్ 4–0–22–3. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (బి) ఎకెల్‌స్టోన్ 22; మూనీ (సి) జోన్స్ (బి) హాజెల్ 14; గార్డ్నర్ (నాటౌట్) 33; లానింగ్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.1 ఓవర్లలో 2 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–29, 2–44. బౌలింగ్: సీవర్ 1.1–0–3–0, ష్రబ్సోల్ 3–0–30–0, ఎకెల్‌స్టోన్ 4–0–12–1, హాజెల్ 3–0–19–1, గోర్డాన్ 3–0–30–0, నైట్ 1–0–10–0. -
సెమీస్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): మహిళల టి20 ప్రపంచ కప్‌లో గ్రూప్ ‘ఎ’నుంచి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లండ్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా సఫారీ జట్టు 19.3 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. మీడియం పేసర్ అన్యా ష్రబ్సోల్ (3/11) ‘హ్యాట్రిక్’తో చెలరేగింది. అనంతరం ఇంగ్లండ్ 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 87 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో విండీస్ 83 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. హేలీ మాథ్యూస్ (36 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), డాటిన్ (35 బంతుల్లో 49; 8 ఫోర్లు), స్టెఫానీ టేలర్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ముందుగా విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 17.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. -
మహిళా టీ-20 : భారత్ శుభారంభం
* బంగ్లాదేశ్‌పై భారత్ విజయం * టి20 మహిళల ప్రపంచ కప్ బెంగళూరు: టి20 ప్రపంచకప్ మహిళల టోర్నీని భారత జట్టు ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అమ్మాయిలు మంగళవారం జరిగిన తమ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 163 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (35 బంతుల్లో 42; 5 ఫోర్లు), వెల్లస్వామి వనిత (24 బంతుల్లో 38; 7 ఫోర్లు) వేగంగా ఆడి తొలి వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), వేద క్రిష్ణమూర్తి (24 బంతుల్లో 36 నాటౌట్; 2 సిక్సర్లు) బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన వీరు తమ భాగస్వామ్యంలో ఆడిన నాలుగు ఓవర్లలో 41 పరుగులు పిండుకున్నారు. ఫహిమా, రుమానాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన బంగ్లా బ్యాట్స్‌వుమెన్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 91 పరుగులకే పరిమితమయింది నిగర్ (25 బంతుల్లో 27; 1 ఫోర్) టాప్ స్కోరర్. పాటిల్, పూనమ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు: భారత మహిళల ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ (సి) జహనారా (బి) రుమానా 42; వనిత (బి) నహీదా 38; మందన ఎల్బీడబ్ల్యు (బి) ఫహిమా 0; హర్మన్‌ప్రీత్ (సి) నహీదా (బి) రుమానా 40; వేద క్రిష్ణమూర్తి నాటౌట్ 36; అనూజ ఎల్బీడబ్ల్యు (బి) ఫహీమా 1; జులన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1-62, 2-63, 3-95, 4-136, 5-141. బౌలింగ్: జహనారా 2-0-16-0; సల్మా 3-0-26-0; లతా 1-0-10-0; నహిదా 4-0-25-1; ఫహీమా 4-0-31-2; ఖడీజా 2-0-20-0; రుమానా 4-0-35-2. బంగ్లాదేశ్ మహిళల ఇన్నింగ్స్: షర్మిన్ (రనౌట్) 21; ఆయెషా రహమాన్ (సి) పూనమ్ (బి) అనూజ 4; సంజిదా (సి) అనూజ (బి) పూనమ్ 2; రుమానా (సి) అనూజ (బి) పూనమ్ 12; నిగర్ నాటౌట్ 27; ఫహిమా ఎల్బీడబ్ల్యు (బి) అనూజ 14; జహనారా నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1-19, 2-24, 3-35, 4-44, 5-68. బౌలింగ్: జులన్ 4-0-17-0; అనూజ 4-0-16-2; రాజేశ్వరి 4-0-27-0; పూనమ్ 4-0-17-2; పాండే 2-0-8-0;హర్మన్‌ప్రీత్ 2-0-6-0.