మహిళా టీ-20 : భారత్ శుభారంభం
* బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
* టి20 మహిళల ప్రపంచ కప్
బెంగళూరు: టి20 ప్రపంచకప్ మహిళల టోర్నీని భారత జట్టు ఘనంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అమ్మాయిలు మంగళవారం జరిగిన తమ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 163 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (35 బంతుల్లో 42; 5 ఫోర్లు), వెల్లస్వామి వనిత (24 బంతుల్లో 38; 7 ఫోర్లు) వేగంగా ఆడి తొలి వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), వేద క్రిష్ణమూర్తి (24 బంతుల్లో 36 నాటౌట్; 2 సిక్సర్లు) బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.
భారీ సిక్సర్లతో విరుచుకుపడిన వీరు తమ భాగస్వామ్యంలో ఆడిన నాలుగు ఓవర్లలో 41 పరుగులు పిండుకున్నారు. ఫహిమా, రుమానాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన బంగ్లా బ్యాట్స్‌వుమెన్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీంతో 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 91 పరుగులకే పరిమితమయింది నిగర్ (25 బంతుల్లో 27; 1 ఫోర్) టాప్ స్కోరర్. పాటిల్, పూనమ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు:
భారత మహిళల ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ (సి) జహనారా (బి) రుమానా 42; వనిత (బి) నహీదా 38; మందన ఎల్బీడబ్ల్యు (బి) ఫహిమా 0; హర్మన్‌ప్రీత్ (సి) నహీదా (బి) రుమానా 40; వేద క్రిష్ణమూర్తి నాటౌట్ 36; అనూజ ఎల్బీడబ్ల్యు (బి) ఫహీమా 1; జులన్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1-62, 2-63, 3-95, 4-136, 5-141.
బౌలింగ్: జహనారా 2-0-16-0; సల్మా 3-0-26-0; లతా 1-0-10-0; నహిదా 4-0-25-1; ఫహీమా 4-0-31-2; ఖడీజా 2-0-20-0; రుమానా 4-0-35-2.
బంగ్లాదేశ్ మహిళల ఇన్నింగ్స్: షర్మిన్ (రనౌట్) 21; ఆయెషా రహమాన్ (సి) పూనమ్ (బి) అనూజ 4; సంజిదా (సి) అనూజ (బి) పూనమ్ 2; రుమానా (సి) అనూజ (బి) పూనమ్ 12; నిగర్ నాటౌట్ 27; ఫహిమా ఎల్బీడబ్ల్యు (బి) అనూజ 14; జహనారా నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1-19, 2-24, 3-35, 4-44, 5-68.
బౌలింగ్: జులన్ 4-0-17-0; అనూజ 4-0-16-2; రాజేశ్వరి 4-0-27-0; పూనమ్ 4-0-17-2; పాండే 2-0-8-0;హర్మన్‌ప్రీత్ 2-0-6-0.