గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): మహిళల టి20 ప్రపంచ కప్‌లో గ్రూప్ ‘ఎ’నుంచి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లండ్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా సఫారీ జట్టు 19.3 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. మీడియం పేసర్ అన్యా ష్రబ్‌సోల్ (3/11) ‘హ్యాట్రిక్’తో చెలరేగింది. అనంతరం ఇంగ్లండ్ 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 87 పరుగులు చేసింది.
మరో మ్యాచ్‌లో విండీస్ 83 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. హేలీ మాథ్యూస్ (36 బంతుల్లో 62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), డాటిన్ (35 బంతుల్లో 49; 8 ఫోర్లు), స్టెఫానీ టేలర్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ముందుగా విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 17.4 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది.
సెమీస్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్
Published Sun, Nov 18 2018 1:01 AM | Last Updated on Sun, Nov 18 2018 1:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment