
పెర్త్: వరుణుడు వెంటాడి అంతరాయాలు కల్పించకపోతే... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వీరోచిత పోరాటంతో రోజంతా ఆడితే తప్ప... సోమవారం ఆస్ట్రేలియా ఖాతాలో యాషెస్ సిరీస్ చేరడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు గెల్చుకున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులోనూ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. 9
నాలుగోరోజు ఆదివారం ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. కుక్ (14), స్టోన్‌మన్ (3), విన్స్ (55; 12 ఫోర్లు), కెప్టెన్ రూట్ (14) అవుటయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు మలాన్ (28 బ్యాటింగ్), బెయిర్‌స్టో (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు... స్టార్క్, లయన్ ఒక్కో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా మళ్లీ బ్యాటింగ్ చేయాలంటే ఇంగ్లండ్ మరో 127 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లున్నాయి. సోమవారం ఆటకు చివరిరోజు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 549/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 662/9 వద్ద డిక్లేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment