Rain Stopped
-
వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు
-
WTC Final: వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు
సౌథాంప్టన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వరుణుడి ఆటంకం తప్పదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలే నిజమయ్యాయి. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలుకానుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే మొదలైన వర్షం టాస్ సమయానికి మరింత తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు తొలి సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. Update: Unfortunately there will be no play in the first session on Day 1 of the ICC World Test Championship final. #WTC21 — BCCI (@BCCI) June 18, 2021 ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో జల్లులు పడుతూనే ఉన్నాయి. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌తోపాటు మైదానంలోని కొంత భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాగా, మ్యాచ్ తొలి రోజు 65 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. వరుణుడి ముప్పు మ్యాచ్ మొత్తానికి(ఐదు రోజులకు) ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. చదవండి: WTC Final: అద్బుతమైన జట్టుతో ఆడుతున్నాం.. విజయం మాదే -
మనకూ తగిలింది వరుణుడి దెబ్బ
నాటింగ్‌హామ్: ప్రపంచ కప్‌ను నీడలా వెంటాడుతున్న వరుణుడు భారత్‌కూ అడ్డుతగిలాడు. దీంతో గురువారం ఇక్కడ న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తొలుత తడిగా ఉన్న ఔట్ ఫీల్డ్, శీతల వాతావరణ ప్రభావంతో టాస్ ఆలస్యమైంది. అరగంట తర్వాత సిద్ధమవబోతుండగా వాన ప్రారంభమైంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇదేమంత అడ్డంకి కాకపోయేది. కానీ, మంగళ, బుధవారాల్లో నాటింగ్‌హామ్‌లో కురిసిన భారీ వర్షాలకు ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీనికి గురువారం వాన తోడవడం, ఎండ ఏమాత్రం లేకపోవడంతో మ్యాచ్ ఆడే వీల్లేకపోయింది. ‘వచ్చారు... చూశారు... వెళ్లారు’ తరహాలో అప్పటికీ ఇంగ్లండ్ కాలమానం ప్రకారం 11.30కు, 12.30కు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చివరి సారిగా పరిస్థితిని సమీక్షించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్‌ల ద్వారా (మూడు విజయాలు, ఒక రద్దు) ఏడు పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ‘టాప్’లో ఉండగా, మూడు మ్యాచ్‌లాడిన భారత్ రెండు విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో ఐదు పాయింట్లతో మూడో స్థానానికి చేరింది. గత మూడు ప్రపంచ కప్‌లలో భారత్, కివీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. చివరిసారి 2003 కప్‌లో సెంచూరియన్ వేదికగా టీమిండియా నెగ్గింది. కప్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగ్గా భారత్ మూడు, కివీస్ నాలుగు గెలిచాయి. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో... గురువారం మ్యాచ్ సాగి ఉంటే టీమిండియాకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది. కీలక ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన నేపథ్యంలో కూర్పును పరీక్షించుకునే అవకాశమూ చిక్కేది. పాక్‌తో మ్యాచ్‌కు సైతం ముప్పు! వారం వ్యవధిలో టోర్నీలో వర్షం కారణంగా రద్దయిన నాలుగో మ్యాచ్ ఇది. వీటిలో మూడింట టాస్ అయినా పడకపోగా, మరోదాంట్లో గంటకు మించి ఆట సాగలేదు. వాతావరణం చూస్తుంటే శుక్రవారం నాటి వెస్టిండీస్, ఇంగ్లండ్ మ్యాచ్ సహా ఇదే బాటలో మరిన్ని మ్యాచ్‌లు ప్రభావితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ జట్లు ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వర్షం ఎదురవ్వలేదు. అన్నింటికీ మించి టోర్నీకే పెద్ద ఆకర్షణ అయిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌కూ వరుణుడి గండం తప్పేలా లేదు. మాంచెస్టర్‌లో ఆదివారం ఈ మ్యాచ్ జరగాలి. నాటింగ్హామ్కు వందపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అక్కడ సైతం వాతావరణం ఇదే తీరుగా ఉంది. అభిమానుల ఆవేదన... ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌లో వర్షం అభిమానులకు మరో రూపంలో ఆవేదన మిగులుస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ప్రారంభం కాకుంటే ప్రేక్షకులకు టిక్కెట్ డబ్బు వెనక్కిస్తారు. అయితే, ఎక్కువశాతం మంది బ్లాక్‌లో టిక్కెట్లు కొంటున్నారు. దీంతో మ్యాచ్ రద్దయినా వీరికి డబ్బు తిరిగి రావడం లేదు. ‘కివీస్‌తో మ్యాచ్‌కు రూ.70 వేలు పెట్టి బ్లాక్‌లో టిక్కెట్ కొన్నా. ఇదంతా పోయినట్లే. పాక్‌తో మ్యాచ్‌కైతే రూ.1.80 లక్షలు చెబుతున్నారు. నేను దీనిని భరించే స్థితిలో లేను’ అని సింగపూర్ నుంచి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ వాపోయాడు. మరోవైపు ‘మేం నాలుగు రోజులైంది సూర్యుడిని చూసి...! భారత్‌తో మ్యాచ్ రద్దు మాకేం ఆశ్చర్యం కలిగించలేదు. విశ్రాంతి దొరుకుతున్నందున ఒకందుకు ఇది మంచిదే అనుకోవాలి’ అని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అన్నాడు. చెరో పాయింట్ సంతోషమే ‘కివీస్‌తో మ్యాచ్ రద్దు సరైన నిర్ణయమే. విజయాలు సాధించి ఉన్నాం కాబట్టి చెరో పాయింట్ దక్కడం ఏమంత ఇబ్బందికరమేం కాదు. పాక్‌తో ఆదివారం మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాం. మా ప్రణాళికలు మాకున్నాయి. మైదానంలో వాటిని అమలు చేయాలి. ధావన్ చేతికి కొన్ని వారాల పాటు ప్లాస్టర్ తప్పనిసరి. లీగ్ మ్యాచ్‌ల చివరి దశలో లేదా సెమీస్‌కు అతడు అందుబాటులోకి వస్తాడు. అతడు తిరిగి ఆడాలని కోరుకుంటున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. -
‘టాస్ గెలిచి స్విమ్మింగ్ ఎంచుకున్న భారత్’
హైదరాబాద్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తాజా ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఎడిషన్ అత్యంత విమర్శల పాలవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడం పట్ల క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం జరగాల్సిన టీమిండియా-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఐసీసీ, ఇంగ్లండ్‌పై విరుచుకపడుతున్నారు. సెటైరికల్ మీమ్స్‌ను సోషల్ మీడియాలో పెట్టి జోకులు వదులుతున్నారు. మరో రెండు మూడు మ్యాచ్ లను వర్షం అడ్డుకుంటే, చాంపియన్ ఎవరో తేల్చాల్సిన అవసరం లేదని, ఆడకుండానే ఎవరో ఒకరు కప్పెత్తుకు పోతారని మండిపడుతున్నారు. ‘నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచి స్మిమ్మింగ్ ఎంచుక్నున టీమిండియా’, ‘ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడాలంటే అండర్ వాటర్‌లో ఆడటం నేర్చుకోవాలి’, ‘ప్రపంచకప్, వర్షం రెండూ ఇంగ్లండ్‌ను వదలడం లేదు’, ‘టాస్ గెలిచిన వాతావరణం తొలుత వర్షాన్ని ఎంచుకుంది’, ‘ఈ ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు వర్షం నీటిని ఎత్తిపోసిన సిబ్బందికి ఇవ్వాలి’అంటూ కామెంట్ పెడుతున్నారు. -
విజయం దిశగా ఆసీస్
పెర్త్: వరుణుడు వెంటాడి అంతరాయాలు కల్పించకపోతే... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వీరోచిత పోరాటంతో రోజంతా ఆడితే తప్ప... సోమవారం ఆస్ట్రేలియా ఖాతాలో యాషెస్ సిరీస్ చేరడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు గెల్చుకున్న ఆస్ట్రేలియా మూడో టెస్టులోనూ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. 9 నాలుగోరోజు ఆదివారం ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. కుక్ (14), స్టోన్‌మన్ (3), విన్స్ (55; 12 ఫోర్లు), కెప్టెన్ రూట్ (14) అవుటయ్యారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు మలాన్ (28 బ్యాటింగ్), బెయిర్‌స్టో (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు... స్టార్క్, లయన్ ఒక్కో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా మళ్లీ బ్యాటింగ్ చేయాలంటే ఇంగ్లండ్ మరో 127 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లున్నాయి. సోమవారం ఆటకు చివరిరోజు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 549/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 662/9 వద్ద డిక్లేర్ చేసింది. -
సమైక్య శంఖారావానికి వరుణుడి మద్దతు!
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమైక్య శంఖారావానికి వరుణుడు కూడా మద్దతు పలికాడు. గత రెండు రోజులుగా నగరాన్ని తడిపిముద్ద చేసిన వరుణుడు సమైక్య శంఖారావం సభ సందర్భంగా నేడు విరామం ప్రకటించాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి వర్షం ఆగిపోవడంతో వాతావరణం పొడిగా మారింది. ప్రతికూల వాతావరణం తొలగిపోవడంతో సమైక్య వాదుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గత రెండు రోజులుగా ఎండపొడ లేకుండా గడిపిన భాగ్యనగరానికి నేడు ఊరట లభించింది. ఎడతెరిపిన లేకుండా వర్షాలతో ఉక్కిరిబిక్కిరయిన నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అటు వర్షం తెరిపివ్వడంతో సమైక్య శంఖారావం సభకు సమైక్యవాదులు పోటెత్తుతున్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ గళం వినిపించేందుకు ఎల్బీ స్టేడియం వైపు కదులుతున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు.