gay marriage
-
స్నేహితురాలిని పెళ్లాడిన ఆ్రస్టేలియా మహిళా మంత్రి
అడిలైడ్: ఆ్రస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన చిరకాల భాగస్వామి సోఫీ అల్లౌచెను పెళ్లి చేసుకున్నారు. ఆ్రస్టేలియా పార్లమెంట్ సభ్యుల్లో మొట్టమొదటిగా స్వలింగ సంపర్కులిగా ప్రకటించుకున్న వాంగ్.. తనతోపాటు పూల బొకెతో పెళ్లి దుస్తుల్లో ఉన్న అల్లౌచె ఫొటోను ఆదివారం ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు. ‘మా కుటుంబసభ్యులు, ఎందరో స్నేహితులు ఈ ప్రత్యేకమైన రోజును మాతో పంచుకున్నందుకు సంతోషిస్తున్నాం’అని వాంగ్ పేర్కొన్నారు. వాంగ్, అల్లౌచె దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారు. శనివారం అడిలైడ్‌లోని ఓ ద్రాక్ష తోటలో వారి వివాహ వేడుక జరిగినట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ తెలిపింది. సెనేట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున వాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ్రస్టేలియా కేబినెట్లో స్థానం సంపాదించుకున్న ఆసియా(చైనా)లో జని్మంచిన మొదటి వ్యక్తి పెన్నీ వాంగ్. ఆ్రస్టేలియాలో 2017 నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. -
స్వలింగ బంధాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్వలింగ బంధాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘లైంగిక లక్షణాలు, మొగ్గుదలల మీద వ్యక్తులకు అదుపు ఉండదు. అవి స్వతఃసిద్ధమైనవి. కనుక వాటి ప్రాతిపదికన ప్రభుత్వాలు ఎవరి పట్లా వివక్ష చూపజాలవు’’ అని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం రెండో రోజు కూడా వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్లు పట్టణ, ఉన్నత వర్గ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. స్వలింగ ధోరణి పట్టణ, ఉన్నత వర్గాలకే పరిమితమైనదన్న వాదనను బలపరిచే సాక్ష్యాలేవీ కేంద్రం చూపలేకపోయిందని పేర్కొంది. ‘‘లైంగిక ధోరణి స్వతఃసిద్ధ భావనే తప్ప దానికి సామాజిక, వర్గ ప్రాతిపదికలేవీ ఉండవన్న సీనియర్ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వి వాదనతో ఏకీభవిస్తున్నాం. స్వేచ్ఛాయుత వాతావరణం కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణులు ఎక్కువగా బయటికి కన్పిస్తుండవచ్చు’’ అని అభిప్రాయపడింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే స్త్రీ పురుషుల పెళ్లీడు, దత్తత వంటివాటిపై పడే ప్రభావంతో పాటు తెరపైకి రాగల పలు ఇతర పరిణామాలను కూడా ధర్మాసనం లోతుగా చర్చించింది. ‘స్వలింగ జంట ఆడయినా, మగయినా పిల్లలను దత్తత తీసుకోవచ్చు. పెరిగే క్రమంలో తమ తల్లుల/తండ్రుల లైంగిక ధోరణి తాలూకు ప్రభావం ఆ పిల్లల మనసులపై ఎలా ఉంటుందన్నది ఆలోచించాల్సిన అంశమే’’ అని అభిప్రాయపడింది. పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకే సుప్రీంకోర్టే చొరవ తీసుకుని స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేశారు. 142వ అధికరణ కింద రాజ్యాంగం కల్పిచిన ప్లీనరీ అధికారాలను వినియోగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ‘‘అత్యున్నత న్యాయస్థానికి ఉన్న ప్రతిష్ట, నైతికత దృష్ట్యా సమాజమూ ఈ నిర్ణయాన్ని అంగీకరించి స్వలింగ వివాహాలను ఆమోదిస్తుందన్న విశ్వాసముంది. తద్వారా వారూ సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపగలరు. వితంతు వివాహాలకూ తొలుత సామాజిక ఆమోదం లేదు. కానీ చట్టం చేశాక ఆమోదం లభించింది’’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ప్రతివాదులుగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ వివాహాలపై వైఖరి తెలపాల్సిందిగా రాష్ట్రాలకు లేఖ రాశామని, వాటి అభిప్రాయాలతో నివేదిక సమర్పించేందుకు అనుమతించాలని కోరింది. -
పేరెంట్స్ కాబోతున్న 'గే' జంట.. ఎలా సాధ్యం?
న్యూజెర్సీ: అమిత్ షా, ఆదిత్య మదిరాజు. 2019లో అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు వీళ్లు చేసిన చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం అసాధ్యం. అయితే ఓ మహిళ వీళ్లకు అండాన్ని దానం చేసింది. దీంతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) పద్ధతిలో వీళ్లు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు. మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ గే జంట ఆనందం వ్యక్తం చేసింది. అందరిలాగే తమకు కూడా ఓ బిడ్డ ఉంటుందని పేర్కొంది. తమను చూసి ఎంతో మంది స్వలింగ సంపర్కులు ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు వాళ్లు పిల్లలను కనే మార్గం కూడా ఉందని తాము నిరూపిస్తున్నామని అమిత్ షా, ఆదిత్య వివరించారు. 4 రౌండ్ల ఐవీఎఫ్ తర్వాత తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయం ఖరారైందని చెప్పారు. ఇకపై స్వలింగ సంపర్కులు కూడా పెళ్లి, పిల్లల విషయంపై ఆందోళన చెందకుండా సంతోషంగా అందరిలాగే సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చని ఈ గే జంట చెబుతోంది. అమిత్ షా గుజరాత్‌కు చెందిన వాడు. న్యూజెర్సీలో స్థిరపడ్డాడు. ఆదిత్య తెలుగు రాష్ట్రాలకు చెందినవాడు ఢిల్లీలో నివసించేవాడు. 2016లో ఓ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ పరిచయమయ్యారు. ఆ తర్వాత మూడేళ్లకు 2019లో న్యూజెర్సీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తొలి ‘గే’ వివాహం జరిగింది. ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్న అభయ్ డాంగ్, సుప్రియో చక్రవర్తి.. తమ కుటుంబ సభ్యులను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. దేశంలో స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత లేకున్నా తమలా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికే ఇలా చేశామని చెప్పారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై.. ఢిల్లీకి చెందిన అభయ్ డాంగ్ (34) హైదరాబాద్‌లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు. కోల్‌కతాకు చెందిన సుప్రియో చక్రవర్తి (31) కూడా నగరంలోనే ఈ కామర్స్ సంస్థ ఉద్యోగి. వీరిద్దరూ 8 సంవత్సరాల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా కలిసి రోజంతా కలిసి మాట్లాడుకున్నారు. కలిసి బ్రతుకుదాం అని నిర్ణయించుకున్నా తమ ప్రేమను బహిర్గతం చేయలేకపోయారు. నాలుగేళ్లుగా గచ్చిబౌలిలో గుట్టుగా సహజీవనం చేస్తున్నారు. పేరెంట్స్ కూడా అలా‘గే’ అన్నాక.. ‘ఓ ఫైన్ మార్నింగ్.. ఎందుకిలా ఎవరికి చెప్పకుండా బ్రతకాలి?’ అని ఇద్దరూ ప్రశ్నించుకున్నారు. వీళ్లు కోరుకోవడంతో గత ఫిబ్రవరి 14న ఈ ప్రేమ వ్యవహారం ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైంది. తదనంతర పరిణామాలతో ‘మేమిద్దరం కలిసి బ్రతుకుతాం’ అని పేరెంట్స్‌కి తేల్చి చెప్పేశారు. తొలుత ఇరువైపుల పెద్దవాళ్లు షాక్ తిన్నా ఆ తర్వాత వీళ్లు వివరంగా చెప్పాక ఓకే అన్నారు. ఇక అడ్డేముంది? పెళ్లి బాజాలు మోగాయి. పెళ్లి జరి‘గే’.. హైదరాబాద్ శంకరపల్లిలోని ఓ రిసార్ట్ వీరి పెళ్లికి వేదికైంది. సంగీత్ వగైరా వేడుకలన్నీ భాగమైన ఈ రెండు రోజుల పెళ్లికి సిటీకి చెందిన మరో ‘గే’ సోఫియా డేవిడ్ పురోహిత పాత్ర పోషించారు. దాదాపు 60 మంది దాకా హాజరైన అతిథులందరికీ చక్కటి వెజిటేరియన్ విందు వడ్డించారు. పూర్తిగా వైట్ థీమ్‌తో జరిగిన పెళ్లి కావడంతో ఇద్దరూ వైట్ కోట్స్ ధరించారు. చట్టం గుర్తించకున్నా త‘గ్గే’దేలే.. ‘మా ప్రేమ స్వచ్ఛమైనది. పెళ్లి ద్వారా మేం ఒక్కటవడం మాత్రమే కాదు.. మాలా సమాజాన్ని ఎదుర్కోలేక బాధపడుతున్న వారికి ధైర్యాన్ని అందించడమే లక్ష్యం’’ అంటున్నారు ఈ గే జంట. ‘మరి పిల్లలో’.. అని అడిగిన వాళ్లకు ‘కాజు’ను చూపిస్తున్నారు. కాజు ఎవరో కాదు.. కొన్నేళ్లుగా వీళ్లతో పాటు జీవిస్తోన్న పెట్ డాగ్. ‘కాజు మా దత్త పుత్రుడు’ అని మురిపెంగా అంటున్నారు. -
కరోనా వ్యాప్తికి ‘గే పెళ్లిళ్లు’ కారణమంట
మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఆ వైరస్ వ్యాప్తికి కారణాలు ఇంకా తెలుసుకునే పని కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడు ఓ కొత్త కారణం చెప్పారు. అది జరగడం వలన కరోనా వ్యాప్తి మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనెవరో కాదు స్కాట్లాండ్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు పీటర్ జెయిట్. ఓ ఆంగ్ల పత్రిక చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్‌గా మారాయి. పీటర్ టెయిట్ స్కాట్లాండ్లోని షెట్ల్యాండ్లో రాజకీయ నాయకుడు పీటర్. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పీటర్ పోటీ చేశాడు. అయితే పోటీ చేసిన పది మందిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిగా పీటర్ నిలిచాడు. ఇటీవల ఆయనను స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో కరోనా గురించి కూడా మాట్లాడాడు. తనకున్న మత సంబంధమైన విశ్వాసాల కారణంగా ‘స్వలింగ సంపర్కుల వివాహం’ కారణంగానే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై వ్యతిరేకత వస్తుందని కూడా పీటర్ తెలిపాడు. ‘ఇది వాళ్లు అంగీకరించరు’ అనే విషయం కూడా తనకు తెలుసని చెప్పాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్జీబీటీలు మండిపడుతున్నారు. అతడి వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సమాజంలో తమపై వివక్ష, విద్వేషాన్ని పెంచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తిట్టి దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే గతంలోనూ ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. -
‘ప్రేమే గెలిచిందని ఈరోజు నిరూపించాము’
తైపీ : స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తైవాన్ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తద్వారా గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. పార్లమెంటు బయట వేలాది మంది హర్ష ధ్వానాలు వినిపిస్తుండగా..శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం మే 24 నుంచి అమల్లోకి రానుంది. కాగా స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసి చరిత్ర సృష్టించామని తైవాన్ అధ్యక్షురాలు సా యింగ్-వెన్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘ శుభోదయం తైవాన్. ఈరోజు కొత్త చరిత్ర సృష్టించేందుకు మాకు అవకాశం దక్కింది. అదే విధంగా తూర్పు ఆసియా నుంచే ఆధునిక భావజాలం విలువలకు సంబంధించిన మూలాలు రూపుదిద్దుకుంటాయనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. అంతేకాదు ప్రేమే గెలిచిందని కూడా ప్రపంచానికి చూపించాం. సమానత్వ భావాన్ని పెంపొందించేందుకు, తైవాన్ను మెరుగైన దేశంగా నిలిపేందుకు నేడు ముందడుగు వేశాం’ అని ట్వీట్ చేశారు. ఇక డీపీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం గే వివాహాల చట్టబద్ధతపై నిర్వహించిన రెఫరెండంలో భాగంగా.. అత్యధిక మంది దీనిని వ్యతిరేకించారని గుర్తు చేశాయి. వివాహం అనేది ఆడ, మగ మధ్య మాత్రమే జరగాలనే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని సా యింగ్-వెన్ అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ చట్టం వల్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆమె ఈ చట్టం తీసుకువచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపుపై నీలినీడలు కమ్ముకమ్ముకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. Good morning #Taiwan. Today, we have a chance to make history & show the world that progressive values can take root in an East Asian society. Today, we can show the world that #LoveWins. pic.twitter.com/PCPZCTi87M — 蔡英文 Tsai Ing-wen (@iingwen) May 17, 2019 -
రాయల్ ఫ్యామిలీ ఇంట ‘గే’ జంట పెళ్లి
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ రాజ కుటుంబంలో విహహం అంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు ఉంటుందని అందరికీ తెలుసు. గత నెలలో రాజ కుమారుడు హ్యారీ, మేఘన్ మార్కెల్ వివాహం కూడా అలాగే జరిగింది. ఇదంతా ఒకెత్తయితే రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడొక ‘గే’ జంట వివాహాం జరగనుంది. క్వీన్ ఎలిజబెత్ సోదరుడు లార్డ్ ఇవార్ మౌంట్ బాటన్, తన సహచరుడు జేమ్స్ కోయల్ను పెళ్లాడనున్నారు. ఈ మేరకు రాయల్ ఫ్యామిలీ సోమవారం ప్రకటించింది. వచ్చే వేసవి కాలంలో ఈ పెళ్లి జరగనుందని తెలిపింది. గే పెళ్లిళ్లు గతంలో జరిగినా రాజ కుటుంబంలో ఇదే తొలిసారి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల హాజరులో డివాన్ పట్టణంలోని ఒక చర్చిలో ఈ వేడుక జరగనుంది. కాగా, ఇవార్ మౌంట్ బాటన్ తన భార్య పెన్నీ బాటన్‌కు 2016లో విడాకులు ఇచ్చారు. వీరికి ఎల్లా అనే కూతురు ఉంది. The Milford Haven Ruby Tiara: Lady Penelope Mountbatten wears the Milford Haven Ruby tiara at her wedding to Lord Ivar Alexander Michael Mountbatten on April 23, 1994. It was the last time it was seen until it showed up in Russia again...hmmm 👀#antique #atiaraaday #aristocracy #bolin #britain #crown #cabochon #diamonds #fluerdelys #gold #history #heart #jewelry #jewelrynerd #lordivarmountbatten #motif #monarchy #milfordhavenrubytiara #royal #rubies #royalty #russian #royalbrides #star #tiara #ladypenelopemountbatten #rubytiara A post shared by A Tiara A Day (@a.tiara.a.day) on Jan 6, 2016 at 8:10pm PST Royal family's first gay wedding: Queen Elizabeth’s cousin to tie the knot . Lord Ivar Mountbatten, a cousin of Queen Elizabeth (whose husband Prince Philip's last name is Mountbatten) is set to marry his partner James Coyle in what will be the first gay wedding in British royal family history. According to E! News, Lord Ivar became the first openly gay extended member of the royal family when he came out in 2016 and revealed his relationship with James. In an interview with Daily Mail, Lord Ivar opens up about struggling with his sexuality during his 16-year marriage to ex-wife, Penny, who he shares three children with. Following their divorce 8 years ago, the former couple are still friends with Penny even scheduled to give her ex-husband away when he marries James in the private chapel on his magnificent country estate in Devon. - “It makes me feel quite emotional. I'm really very touched,” Penny said of the honour. And, of course, the couple have the blessing of his entire family including lifelong friend, Prince Edward, Earl of Wessex - aka Queen Elizabeth’s youngest son - and his wife Sophie, Countess of Wessex. - “Sophie and Edward know of our plans and are really excited for us,” says Lord Ivar, adding that sadly the royal couple will not be able to attend the wedding due to prior engagements.” - The couple will tie the knot in a small, private ceremony in front of 120 family members and close friends. #royalfamily #queenelizabeth #jamescoyle #gaywedding #lordivarmountbatten A post shared by MediaGuide.NG (@mediaguide.ng) on Jun 18, 2018 at 4:03pm PDT -
ఔను...వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
సాక్షి, ముంబై: యావత్మాల్లో స్వలింగ సంపర్క (గే) వివాహం జరిగింది. స్థానిక ప్రముఖ పుస్తక విక్రేత తనయుడు ఇండోనేషియ యువకుడితో ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. మహారాష్ట్రలోని యావత్మాల్లోని ఓ విలాసవంతంమైన హోటల్లో ఈ పెళ్లి తంతు జరిగింది. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీని ఈ స్వలింగ సంపర్క వివాహం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ విషయం బయట ఎక్కడ పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. ఈ పెళ్లికి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేవలం దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించారు. కాగా వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. పెళ్లికి ముందు హిందు సంప్రదాయం ప్రకారం ఇరువురికి పసుపు రాయడం, ఇతర తంతు పూర్తి చేశారు. బయట వ్యక్తులెవరు లోపలికి రాకుండా, బంధువుల్లో కూడా ఎవరు ఫొటోలు, వీడియో తీయకుండా నిఘావేసినప్పటికీ ఓ ఫోటో వైరల్ కావడంతో బయట ప్రపంచానికి తెలిసింది. యావత్మాల్కు చెందిన 40 ఏళ్ల హృషి మోహన్‌కుమార్ సత్వానే అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల ఆశీస్సులతో అతను పెళ్లి చేసుకున్నాడు. ఇండోనేషియాకు చెందిన విన్ను తన భాగస్వామిగా మార్చుకున్నాడు. హృషి మోహన్‌కుమార్ బాంబే ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఇతను అమెరికాలో గ్రీన్ కార్డు హోలర్డ్. మొదట్లో అతని పేరెంట్స్ గే మ్యారేజ్‌కు అంగీకరించలేదు. కానీ చివరకు పెళ్లికి ఓకే చెప్పేశారు. -
భావోద్వేగం.. సభలోనే ‘గే మ్యారేజ్’ ప్రపోజల్!
మెల్బోర్న్ : గే చట్టాలకు ఇటీవల పలు దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఓ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా దీనిపై చర్చ జరుగుతుండగా.. సభలో ఓ ఎంపీ చేసిన పని విపరీతంగా వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన బిల్లుపై చర్చిస్తున్న సమయంలో ఎంపీ టిమ్ విల్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే అతని భాగస్వామి అయిన ఎంపీ రాయన్ ప్యాట్రిక్ బోల్జర్ అక్కడే ఉన్నాడు కాబట్టి. చర్చలో ప్రసంగించిన అనంతరం చివరకు... ‘‘ఇక మిగిలింది ఒక్కటే. ప్యాట్రిక్... నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని భావోద్వేగంతో అడిగాడు. అంతే సభలోని సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. సంతోషంతో బోల్జర్ అవును అని చెప్పటంతో కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోయింది. ఆపై డిప్యూటీ స్పీకర్ రాబ్ మిచెల్ల్ ఆ జంటకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఎంతో అరుదైన క్షణం అని వ్యాఖ్యానించాడు. గత ఏడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కానీ అక్కడ స్వలింగ వివాహాలపై నిషేధం ఉండటం కారణంగా పెళ్లి చేసుకోలేక పోయారు. త్వరలో ఆ నిషేధం ఎత్తివేయనున్న నేపథ్యంలో టిమ్ ఇప్పుడు ప్రపోజ్ చేశాడన్న మాట. గత వారం ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా.. ఇప్పుడు దిగువ సభ కూడా ఆమోదించింది. త్వరలోనే ఆ చట్టం అమలులోకి రానుంది. -
సభలోనే ‘గే మ్యారేజ్’ ప్రపోజల్!
-
అమెరికా ప్రజల సంచలన నిర్ణయం
వాషింగ్టన్: స్వలింగ సంపర్కుల విషయంలో అమెరికాలో మరో రికార్డు నమోదైంది. గేల వివాహానికి అమెరికాలో మద్దతివ్వొచ్చా.. వాటికి చట్టపరమైన గుర్తింపు ఉండాలా అనే అంశంపై నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అమెరికాలో భారీ ఎత్తున స్పందన వచ్చింది. వాటికి అనుమతించాల్సిందేనని, చట్టాల ద్వారా గుర్తించాలని దాదాపు 61శాతం అమెరికన్లు తమ అభిప్రాయాలు చెప్పారు. గాలప్ అనే కంపెనీ ఈ అధ్యయనం నిర్వహించింది. 1996నాటి అభిప్రాయాలతో పోల్చగా ఈసారి రికార్డు స్థాయిలో మద్దతు తెలిపారు. ఆ సమయంలో కేవలం 27శాతంమంది మాత్రమే ఇలాంటి వివాహాలకు అనుకూలంగా ఓటువేశారు. గే వివాహాలకు సంబంధించి అమెరికాలో గత కొద్ది రోజులుగా అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాలప్ కంపెనీ స్వయంగా 2011 నుంచి ఒక అధ్యయనం ప్రారంభించింది. దాదాపు అన్ని వయసుల వారిని ఈ అధ్యయనం లో చేర్చింది. తాజాగా వారు చెప్పిన అభిప్రాయాలు గతంలో 1996నాటి సమయంలో నిర్వహించిన సర్వేతో పోల్చి చూడగా ఈసారి గతంలో చెప్పినవారి శాతంకన్నా రెట్టింపు అయింది. 30 ఏళ్లలోపు వారంతా గే వివాహాలకు ఓకే చెప్పగా.. 65 ఏళ్ల పైబడిన వారు మాత్రం ఓకే చెప్పడంతోపాటు వాటికి చట్టభద్రత ఇవ్వాలని, గుర్తింపునివ్వాలని చెప్పారు. గే సంఘాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కూడా చెప్పారు. -
ఆ పెళ్లిళ్లు కుదరవన్న చైనా!
బీజింగ్: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తున్న నేపథ్యంలో చైనాలో కూడా ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఓ గే హక్కుల కార్యకర్త వేసిన తొలి కేసును చైనా కోర్టు కొట్టివేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో పోరాడుతామని పిటిషనర్ సన్ వెన్లిన్ మీడియాకు తెలిపారు. గే పెళ్లిళ్లపై దేశంలో దాఖలుచేసిన తొలి కేసు కావడంతో.. వందల సంఖ్యలో గే కార్యకర్తలు కోర్టుకు హాజరయ్యారు. అయితే జడ్జి ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని క్షణాల్లోనే పిటిషన్‌ను తిరస్కరించడం పట్ల పిటిషనర్ తరఫు న్యాయవాది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం తమ వాదనైనా పూర్తిగా వినాలి కదా అని వ్యాఖ్యానించారు. దీనిపై తాను ఎంత దూరమైనా పోరాడతానని, కేసుకు ఓ పరిష్కారం చూపిస్తానని పిటిషనర్ వెన్లిన్ తెలిపారు. చైనాలో గే పెళ్లిళ్లకు చట్టబద్ధత లేదు గానీ సామాజికంగా ఆమోదం ఎక్కువగానే ఉంది. ఎన్నో గే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే అవన్నీ 2012 వరకు గుట్టుచప్పుడు కాకుండానే జరిగేవి. ఆ సంవత్సరం ఇద్దరు యువకులు బహిరంగంగా పెళ్లి చేసుకుని ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం అప్పుడు సంచలనం సృష్టించింది. వారికి సోషల్ మీడియా నుంచి పూర్తి మద్దతు లభించింది. అప్పటి నుంచి గే మ్యారేజీలు పెరిగాయి. -
'గే మ్యారేజ్ లైసెన్సా.. చస్తే ఇవ్వను'
వాషింగ్టన్: అమెరికాలో స్వలింగ వివాహాలకు ఆ దేశ సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించినప్పటికీ అమలులో మాత్రం అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. తాజాగా 27 ఏళ్లుగా సహజీవనం చేస్తోన్న ఇద్దరు గేలు మ్యారేజ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే 'లైసెన్స్ జారీ చేసేది లేదు' అంటూ ఓ అధికారిణి తేల్చిచెప్పింది. దీంతో ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సదరు గేలు. వివరాలు.. టెక్సాస్ రాష్ట్రంలోని హుడ్కౌంటీకి చెందిన జిమ్ కాటో, జో స్టాపెలటన్ 27 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జూన్ 30న అమెరికా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడంతో తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకోవాలని భావించి, సమీపంలోని రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడి క్లర్కు కేట్ లాంగ్.. గే మ్యారేజ్ లైసెన్స్ మంజూరీకి నిరాకరించింది. పైగా ''ఆడ, మగ పెళ్లి చేసుకోవడమొక్కటే ప్రకృతి ధర్మం. గే, లెస్బియన్స్ వివాహాలను మతం అంగీకరించదు'' అని జిమ్, జోలకు క్లాస్ పీకింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన గే జంట.. కోర్టును ఆశ్రయించింది. మరో ప్రయత్నంగా జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. స్పందించిన అధికారులు అక్కడిక్కడే వారికి మ్యారేజ్ లైసెన్స్ మంజూరు చేశారు. అయితే కింది ఆఫీసులో తమ వివాహం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి, అవమానించిన క్లర్కు కేట్ తీరు మార్చుకునే వరకు దావాను వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు జిమ్, జోల తరఫు న్యాయవాది. -
'ఆడా- మగల వివాహం దైవనిర్ణయం'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో నిలిచినప్పటినుంచి అధికార పక్షంపై విమర్శలదాడిని పెంచిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ ఈసారి ఏకంగా ఆదేశ సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబట్టారు. స్వలింగ వివాహాలకు చట్టపరమైన అనుమతినిస్తూ కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు అనైతికమని విమర్శించారు. 'ఆడా- మగ మధ్య వివాహం జరగడం దైవనిర్ణయం. దానికి విరుద్ధంగా స్వలింగ వివాహాలను ప్రోత్సహించడం తప్పు. భూమి మీదున్న ఏ కోర్టులూ ఆ నియమాన్ని మార్చలేవు. అలా ప్రయత్నించడం దారుణం, ఆక్షేపనీయం. విలువలకు కట్టుబడి ఉండాలనుకునే వారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు శరాఘాతం లాంటిదనడంలో ఎలాంటి సందేహంలేదు' అని జిందాల్ వ్యాఖ్యానించారు. ఓబామా కేర్ ను కోర్టులు ఆకాశానికెత్తడంపైగా అసహనం వ్యక్తం చేశారు. శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణగానీ, రాష్ట్రాల ఆమోదంగానీ లేకుండా ఇంత కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పూర్తిగా అదుపుతప్పిందని, జ్యుడీషియరీ సభ్యులు తమ సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దేప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రధాని 'గే' వివాహం
లక్సెంబర్గ్: లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బిటెల్ (42) 'గే' (స్వలింగ) వివాహాం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక నగరంలోని టౌన్ హాల్లో తన సహచరుడు, ఆర్కిటెక్ట్ అయిన గౌతియర్ డెస్టెనేను ఆయన సంప్రదాయబద్ధంగా పెళ్లాడారు. 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌లో స్వలింగ వివాహం చేసుకున్న తొలి ప్రధాని బిటెల్ కావటం విశేషం. ఈ వివాహ వేడుకకు బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో పాటు సుమారు 500మంది అతిథులు హాజరయ్యారు. 2010లో ఐస్లాండ్ ప్రధాని జోహనా సిగుర్డార్డోటిర్ కూడా తన సహచరిణిని పెళ్లాడింది. ఆ తర్వాత ప్రపంచ దేశాధినేతల్లో స్వలింగ వివాహం చేసుకున్న రెండో నాయకుడు బిటెల్. 2013 డిసెంబర్లో జేవియర్ బిటెల్ లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందు నుంచే ఆయన గోతియర్తో సహజీవనం చేస్తున్నారు. -
సహచరుడ్ని పెళ్లాడనున్న ప్రధాని
ప్రశాంత జీవనానికి చిరునామా లాంటి పశ్చిమ యూరప్ దేశం లక్సెంబర్గ్.. మరో అరుదైన వేడుకకు వేదిక కానుంది. ఆ దేశ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్.. తన సహచరుడు గోథియర్ను వచ్చే నెలలో పెళ్లాడనున్నట్లు అధికారిక వర్గాలు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపాయి. స్వలింగ సంపర్కుడయిన జేవియర్.. 2013 డిసెంబర్లో లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందునుంచే ఆయన గోథియర్తో సహజీవనం చేస్తున్నారు. ప్రధాని హోదాలో ఒక గే పెళ్లిచేసుకోనుండటం ఇదే ప్రధమం కావడంతో ఈ వేడుకపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు కొన్ని పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్రచురించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ వివాహం తన వ్యక్తిగత విషయమని, ప్రచారం అవసరంలేదని ప్రధాని జేవియర్ సున్నితంగా తిర్కరించారు. లక్సెంబర్గ్ నగరంలోని రోమన్ క్యాథలిక్ డచీ చర్చీలో వీరి వివాహం జరగనుంది. ఎన్నికల్లో భారీ మెజారితో గెలిచిన జేవియర్.. లక్సెంబర్గ్‌లో ఎల్జీబీటీ (లెస్బియాన్, గే, బైసెక్పువల్స్, ట్రాన్స్‌జెండర్స్) హక్కుల పరిరక్షణకోసం చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రెండు నెలల కిందటే గే మ్యారేజ్‌ను చట్టబద్ధం చేశారు.