ఆ పెళ్లిళ్లు కుదరవన్న చైనా! | A Court in chiana qushes Gay marriage petion filed by a member | Sakshi
Sakshi News home page

ఆ పెళ్లిళ్లు కుదరవన్న చైనా!

Published Fri, Apr 15 2016 3:11 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

ఆ పెళ్లిళ్లు కుదరవన్న చైనా!

ఆ పెళ్లిళ్లు కుదరవన్న చైనా!

బీజింగ్: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తున్న నేపథ్యంలో చైనాలో కూడా ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఓ గే హక్కుల కార్యకర్త వేసిన తొలి కేసును చైనా కోర్టు కొట్టివేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో పోరాడుతామని పిటిషనర్ సన్ వెన్లిన్ మీడియాకు తెలిపారు. గే పెళ్లిళ్లపై దేశంలో దాఖలుచేసిన తొలి కేసు కావడంతో.. వందల సంఖ్యలో గే కార్యకర్తలు కోర్టుకు హాజరయ్యారు. అయితే జడ్జి ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని క్షణాల్లోనే పిటిషన్ను తిరస్కరించడం పట్ల పిటిషనర్ తరఫు న్యాయవాది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీసం తమ వాదనైనా పూర్తిగా వినాలి కదా అని వ్యాఖ్యానించారు.

దీనిపై తాను ఎంత దూరమైనా పోరాడతానని, కేసుకు ఓ పరిష్కారం చూపిస్తానని పిటిషనర్ వెన్లిన్ తెలిపారు. చైనాలో గే పెళ్లిళ్లకు చట్టబద్ధత లేదు గానీ సామాజికంగా ఆమోదం ఎక్కువగానే ఉంది. ఎన్నో గే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే అవన్నీ 2012 వరకు గుట్టుచప్పుడు కాకుండానే జరిగేవి. ఆ సంవత్సరం ఇద్దరు యువకులు బహిరంగంగా పెళ్లి చేసుకుని ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం అప్పుడు సంచలనం సృష్టించింది. వారికి సోషల్ మీడియా నుంచి పూర్తి మద్దతు లభించింది. అప్పటి నుంచి గే మ్యారేజీలు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement