మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఆ వైరస్ వ్యాప్తికి కారణాలు ఇంకా తెలుసుకునే పని కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడు ఓ కొత్త కారణం చెప్పారు. అది జరగడం వలన కరోనా వ్యాప్తి మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనెవరో కాదు స్కాట్లాండ్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు పీటర్ జెయిట్. ఓ ఆంగ్ల పత్రిక చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్‌గా మారాయి.
పీటర్ టెయిట్
స్కాట్లాండ్‌లోని షెట్‌ల్యాండ్‌లో రాజకీయ నాయకుడు పీటర్. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పీటర్ పోటీ చేశాడు. అయితే పోటీ చేసిన పది మందిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిగా పీటర్ నిలిచాడు. ఇటీవల ఆయనను స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో కరోనా గురించి కూడా మాట్లాడాడు. తనకున్న మత సంబంధమైన విశ్వాసాల కారణంగా ‘స్వలింగ సంపర్కుల వివాహం’ కారణంగానే కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై వ్యతిరేకత వస్తుందని కూడా పీటర్ తెలిపాడు. ‘ఇది వాళ్లు అంగీకరించరు’ అనే విషయం కూడా తనకు తెలుసని చెప్పాడు.
ఆయన చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్జీబీటీలు మండిపడుతున్నారు. అతడి వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సమాజంలో తమపై వివక్ష, విద్వేషాన్ని పెంచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తిట్టి దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే గతంలోనూ ఉక్రెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment