సాక్షి, ముంబై: యావత్మాల్‌లో స్వలింగ సంపర్క (గే) వివాహం జరిగింది. స్థానిక ప్రముఖ పుస్తక విక్రేత తనయుడు ఇండోనేషియ యువకుడితో ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లోని ఓ విలాసవంతంమైన హోటల్‌లో ఈ పెళ్లి తంతు జరిగింది. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీని ఈ స్వలింగ సంపర్క వివాహం జరిగినట్లు తెలుస్తున్నది.
ఈ విషయం బయట ఎక్కడ పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. ఈ పెళ్లికి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేవలం దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించారు. కాగా వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. పెళ్లికి ముందు హిందు సంప్రదాయం ప్రకారం ఇరువురికి పసుపు రాయడం, ఇతర తంతు పూర్తి చేశారు. బయట వ్యక్తులెవరు లోపలికి రాకుండా, బంధువుల్లో కూడా ఎవరు ఫొటోలు, వీడియో తీయకుండా నిఘావేసినప్పటికీ ఓ ఫోటో వైరల్ కావడంతో బయట ప్రపంచానికి తెలిసింది.
యావత్మాల్‌కు చెందిన 40 ఏళ్ల హృషి మోహన్‌కుమార్ సత్వానే అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. కుటుంబసభ్యులు, స్నేహితుల ఆశీస్సులతో అతను పెళ్లి చేసుకున్నాడు. ఇండోనేషియాకు చెందిన విన్‌ను తన భాగస్వామిగా మార్చుకున్నాడు. హృషి మోహన్‌కుమార్ బాంబే ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఇతను అమెరికాలో గ్రీన్ కార్డు హోలర్డ్. మొదట్లో అతని పేరెంట్స్ గే మ్యారేజ్‌కు అంగీకరించలేదు. కానీ చివరకు పెళ్లికి ఓకే చెప్పేశారు.
Comments
Please login to add a commentAdd a comment